Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Nissan Ariya EV | కొత్తగా నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు.. ఫుల్ ఛార్జ్ తో 500 కి.మీలు ప్రయాణించవచ్చు.. !

Spread the love

Nissan Ariya EV: భారత్ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్  కార్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలన్నీ కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెట్టాయి. అయితే నిస్సాన్ కంపెనీ కూా తన కొత్త ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి ముందు నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ప్రారంభించనుంది. దీని బుకింగ్ కూడా ప్రారంభించనుంది. నిస్సాన్ తన కొత్త EV అయిన  నిస్సాన్ ఆరియా (Nissan Ariya EV)ను దేశంలో ప్రారంభించవచ్చు.

నిస్సాన్ ఆరియా డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారు కూపే డిజైన్‌తో రూపొందించారు. మొదటి, వెనుక భాగంలో షోల్డర్ లైన్ కనిపిస్తుంది. ఇందులో కొత్త డిజైన్ షీల్డ్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే వెనుక భాగం కూడా దాని స్టైలిష్ గ్రిల్, బంపర్, హెడ్‌లైట్, టెయిల్‌లైట్‌తో చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు.

ఫీచర్లు..

కొత్త నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు 12.3- ఇంటన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. అలాగే ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లాస్టర్ కూడా అందించారు. ఇది కాకుండా.. ఈ కారులో హెడ్ అప్ డిస్‌ప్లే, బోష్ ఆడియో సిస్టమ్‌,  హాప్టిక్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇవ్వనున్నారు. అంతేకాకుండా రక్షణ కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌తో పాటు ఈబీడీ, ఐఎస్‌సీ, ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లను కూడా అందించే  చాన్స్ ఉంది.

పవర్ట్రైన్..

నివేదికల ప్రకారం.. కొత్త నిస్సాన్ ఆరియాలో రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికను అందించవచ్చు. దీనికి 63 kWh, 87 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని వార్తలువ వినిపిస్తున్నాయి.  దీని 63 kWh బ్యాటరీ ప్యాక్ 217 HP  ఎనర్జీ, 300 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ వేరియంట్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ తో సుమారు 402 మైలేజీ ఇస్తుంది. అలాగే  87 KW వేరియంట్ కాకుండా 242 HP పవర్‌తో 300 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ వేరియంట్ ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే సుమారు  513 కిమీల  రేంజ్ ఇస్తుంది.

లాంచ్ ఎప్పుడు

ప్రస్తుతం నిస్సాన్ ఈ EV లాంచ్ తేదీ గురించి కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.  అయితే, వచ్చే ఏడాది నాటికి కంపెనీ ఈ కారును మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారు 2022లో Euro NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందడం విశేషం.. ఈ నిస్సార్ ఆరియా ఈవీ మార్కెట్ లోకి వస్తే.. MG ZS EVకి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.


reen Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *