ఓలా ఎలా ఇలా.. ?
పుణేలో కాలిపోయిన ola s1 pro electric scooterఅద్భుతమైన ఫీచర్లతో కొద్ది రోజుల క్రితం విడుదలైన ola s1 pro electric scooter (ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్) మార్కెట్‌లో సంచలనమే సృస్టించింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 24గంటల్లోనే లక్ష మంది రిజిస్టర్ అయి రికార్ట్ నమోదు చేసుకుంది. అయితే మహారాష్ట్రలోని పూణేలోని ధనోరి ప్రాంతంలో గత శనివారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నికి ఆహుతి కావడం కలకలం సృష్టగించింది. ఈ విషయాన్ని ఓలా ప్రకటన ధ్రువీకరించింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు ఓలా తెలిపింది. వాహన భద్రత అత్యంత కీలకమని, తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా ఓలా హామీ ఇచ్చింది.Ola యొక్క అధికారిక ప్రకటన సారాంశం ఏంటంటే.. "మా స్కూటర్‌లలో ఒకదానితో పూణేలో జరిగిన ఒక సంఘటన గురించి మాకు తెలుసు. దీనికి గల మూలకారణాన్ని అర్థం చేసుకోవడానికి దర్యాప్తు చ...