ఓలా ఎలా ఇలా.. ?

Electric vehicle battery safety standards
Spread the love

పుణేలో కాలిపోయిన ola s1 pro electric scooter

Ola-S1-Pro-Scooter
Ola-S1-Pro-Scooter

అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో కొద్ది రోజుల క్రితం విడుద‌లైన ola s1 pro electric scooter (ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇండియన్) మార్కెట్‌లో సంచ‌ల‌న‌మే సృస్టించింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 24గంట‌ల్లోనే ల‌క్ష మంది రిజిస్ట‌ర్ అయి రికార్ట్ న‌మోదు చేసుకుంది. అయితే మ‌హారాష్ట్రలోని పూణేలోని ధనోరి ప్రాంతంలో గ‌త శనివారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అగ్నికి ఆహుతి కావ‌డం క‌ల‌క‌లం సృష్ట‌గించింది. ఈ విష‌యాన్ని ఓలా ప్రకటన ధ్రువీక‌రించింది. ఈ ఘ‌ట‌న‌పై విచారణ ప్రారంభించినట్లు ఓలా తెలిపింది. వాహన భద్రత అత్యంత కీలకమని, తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓలా హామీ ఇచ్చింది.

Ola యొక్క అధికారిక ప్రకటన సారాంశం ఏంటంటే.. “మా స్కూటర్‌లలో ఒకదానితో పూణేలో జరిగిన ఒక సంఘటన గురించి మాకు తెలుసు. దీనికి గ‌ల మూలకారణాన్ని అర్థం చేసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నాము. రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ పంచుకుంటాము. మేము కస్టమర్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాము. ఓలా వాహ‌నాలు ఖచ్చితంగా సురక్షిత‌మ‌ని తెలిపారు. మరియు మేము మా ఉత్పత్తులలో అత్యధిక నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాము. మేము ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తాము మరియు తగిన చర్య తీసుకుంటాము మరియు రాబోయే రోజుల్లో మరింత భాగస్వామ్యం చేస్తాము.”

ఒలా S1ఎల‌క్ట్రిక్ స్కూటర్‌ లో దట్టమైన పొగలు రావడంతో కొంంద‌రు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన వీడియో క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయింది. పూణేలో రోడ్డుపై పార్క్ చేసిన స్కూటర్ నుండి పొగలు రావడం ప్రారంభించినప్పుడు చాలా మంది వ్యక్తులు రికార్డ్ చేయడం ప్రారంభించారు. ఆపై చిన్న పేలుడుతో మంటలు చెలరేగాయి.

ఇక్కడ లిథియం-అయాన్ బ్యాటరీ లోపల ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఏర్పడుతుంది.

పుణేలోని రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రోడ్డు పక్కన నిలిపారు. కాగా ఇది 31 సెకన్లలో పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనను చూస్తున్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. కొత్తగా విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ నాణ్యతపై కూడా అనేక సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం సంప్ర‌దించ‌డండి : Haritha mithra

One Reply to “ఓలా ఎలా ఇలా.. ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *