ఒక్క నెలలోనే 35వేల యూనిట్ల అమ్మకాలు
మే 2023లో Ola Electric ఘనత
పెరిగిన S1, S1 ప్రో వాహనాల ధరలు
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మే 2023 నెలలో తన విక్రయాల గణాంకాలను వెల్లడించింది. గత నెలలో 35,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 303 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో ఓలా ఈవీ కేవలం 8,681 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
303శాతం వృద్ధి
మే 2023లో 35,000కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది, అమ్మకాలలో 303 శాతం , 16.6 శాతం MoM వృద్ధిని నమోదు చేసింది. మే 2022లో, దాని అమ్మకాలు 8,681 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ 30,000 యూనిట్లకు పైగా విక్రయించింది. Ola ఇటీవల భారతదేశంలో తన 500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి 1,000 రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ప...