Ola Service Center | 500వ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా.. దేశవ్యాప్తంగా ఉచిత హెల్త్ చెకప్ లు..
Ola Electric తన నెట్‌వర్క్‌ను క్రమంగా బలోపేతం చేసుకుంటోంది. తాజాగా కేరళలోని కొచ్చి నగరంలో 500వ సర్వీస్ సెంటర్ (Ola Service Center)ని ప్రారంభించింది. కేరళలో ఓలా కంపెనీకి ఇదే అతిపెద్ద సర్వీస్ సెంటర్. ఈ సందర్భంగా ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ఉచిత స్కూటర్ హెల్త్ చెకప్‌ను ప్రకటించింది.బెంగళూరు/కొచ్చి : దేశవ్యాప్తంగా తన సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు కేరళలోని కొచ్చిలో తన 500వ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించబడిన ఈ సర్వీస్ సెంటర్ కంపెనీకి సంబంధించి కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద సేవా కేంద్రం.. Ola దేశవ్యాప్తంగా తన సేవా కేంద్రాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేంద్రాల్లో ఓలా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల తర్వాత అన్ని సర్వీస్ లకు వన్-స్టాప్ సొల్యూషన్ సెంటర్గా పనిచేస్తాయి.
దేశవ్యాప్తంగా ఉచిత హెల్త్ చెకప్..
500వ సర్వీస్ సెంటర్ (O...