Ola Electric తన నెట్‌వర్క్‌ను క్రమంగా బలోపేతం చేసుకుంటోంది. తాజాగా కేరళలోని కొచ్చి నగరంలో 500వ సర్వీస్ సెంటర్ (Ola Service Center)ని ప్రారంభించింది. కేరళలో ఓలా కంపెనీకి ఇదే అతిపెద్ద సర్వీస్ సెంటర్. ఈ సందర్భంగా ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ఉచిత స్కూటర్ హెల్త్ చెకప్‌ను ప్రకటించింది.
బెంగళూరు/కొచ్చి : దేశవ్యాప్తంగా తన సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు కేరళలోని కొచ్చిలో తన 500వ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించబడిన ఈ సర్వీస్ సెంటర్ కంపెనీకి సంబంధించి కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద సేవా కేంద్రం.. Ola దేశవ్యాప్తంగా తన సేవా కేంద్రాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేంద్రాల్లో ఓలా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల తర్వాత అన్ని సర్వీస్ లకు వన్-స్టాప్ సొల్యూషన్ సెంటర్గా పనిచేస్తాయి.
దేశవ్యాప్తంగా ఉచిత హెల్త్ చెకప్..
500వ సర్వీస్ సెంటర్ (Ola Service Center) ప్రారంభోత్సవం సందర్బంగా ఓలా ప్రతినిధి మాట్లాడుతూ, “ఓలాలో కస్టమర్లకు సంతృప్తికరమైన యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరచడమే మా లక్ష్యమని, సాధ్యమైనంత తక్కువ సమయంలో మా కస్టమర్‌ల అన్ని రకాల సర్వీస్ లను అందించేందుకు దేశమంతటా బలమైన సేవా నెట్‌వర్క్ ఉందని తెలిపారు. మేము వాహనాల మా అమ్మకాల తర్వాత & సేవా నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రక్రియను కొనసాగిస్తాము.” 500వ సేవా కేంద్రం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, కంపెనీ ఆదివారం (ఏప్రిల్ 21) భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో దేశవ్యాప్తంగా ఉచిత స్కూటర్ హెల్త్ చెకప్‌ను నిర్వహిస్తుంది అని తెలిపారు.
రూ.70వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్..
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల మాస్-మార్కెట్ విభాగంలోకి ప్రవేశించింది. ఓలా S1 X పోర్ట్‌ఫోలియో కోసం కొత్త ధరలను ప్రకటించింది. మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో (2 kWh, 3 kWh, 4 kWh) అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ ఇప్పుడు వరుసగా INR 69,999 (పరిచయ ధర), INR 84,999, INR 99,999 ధరలకు అందుబాటులో ఉంది. డెలివరీలు వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. కంపెనీ S1 ప్రో, S1 ఎయిర్, S1 X+ ధరలను వరుసగా INR 1,29,999, INR 1,04,999, INR 84,999కి సవరించింది. Ola ఎలక్ట్రిక్ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 8-సంవత్సరాల/80,000 కిమీ బ్యాటరీ వారంటీని కూడా అందిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీపై వారంటీని పొడిగించడం ద్వారా EV స్వీకరణకు ఉన్న అడ్డంకులను పరిష్కరించినట్లయింది.
వినియోగదారులు యాడ్-ఆన్ వారంటీని కూడా ఎంచుకోవచ్చు. 1,00,000 కి.మీ వరకు ప్రయాణించే కిలోమీటర్ల గరిష్ట పరిమితిని INR 4,999కి, 1,25,000 కి.మీల వరకు గల వారంటీని రూ. 12,999 చెల్లించాల్సి ఉంటుంది. Ola Electric 3KW పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్ ను కూడా పరిచయం చేసింది, ఇది రూ.29,999 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..