పుణే నగరానికి 150 Olectra ఎలక్ట్రిక్ బస్సులు
పుణే నగరానికి 150 Olectra ఎలక్ట్రిక్ బస్సులు ప్రజా రవాణా కోసం పుణెలో ఓలెక్ట్రా తయారు చేసిన 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే అంకితం చేశారు. ఈ సందర్భంగా అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. డీజిల్ వినియోగాన్నినివారించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించాలని ఆయన దేశానికి విజ్ఞప్తి చేశారు. ఒలెక్ట్రా భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్రపథాన కొనసాగుతోంది. ప్రస్తుతం పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (PMPML) కోసం పూణేలో 150 బస్సులను నడుపుతోంది. సూరత్, ముంబై, పూణే, సిల్వస్సా, గోవా, నాగ్‌పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలో కూడా ఓలెక్ట్రా విజయవంతంగా ఎలక్ట్రిక్ బస్సును నడిపిస్తోంది. కొత్త olectra 150 ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో పూణే నగర వాసులు ఎయిర్ కండిషన్డ్, శబ్దం లేని ప్ర...