పుణే నగరానికి 150 Olectra ఎలక్ట్రిక్ బస్సులు
ప్రజా రవాణా కోసం పుణెలో ఓలెక్ట్రా తయారు చేసిన 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే అంకితం చేశారు. ఈ సందర్భంగా అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. డీజిల్ వినియోగాన్నినివారించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించాలని ఆయన దేశానికి విజ్ఞప్తి చేశారు. ఒలెక్ట్రా భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్రపథాన కొనసాగుతోంది. ప్రస్తుతం పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (PMPML) కోసం పూణేలో 150 బస్సులను నడుపుతోంది. సూరత్, ముంబై, పూణే, సిల్వస్సా, గోవా, నాగ్‌పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలో కూడా ఓలెక్ట్రా విజయవంతంగా ఎలక్ట్రిక్ బస్సును నడిపిస్తోంది.
కొత్త olectra 150 ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో పూణే నగర వాసులు ఎయిర్ కండిషన్డ్, శబ్దం లేని ప్రయాణాన్ని ఆశ్వాదించనున్నారు. ఇవి నగరంలో CO2 ఉద్గారాలను గణనీయంగా తగ్గించనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులు 100% ఎలక్ట్రిక్, జీరో-ఎమిషన్, ఇంకా అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉన్నాయి. Olectra యొక్క అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు సూరత్, గోవా, సిల్వస్సా, డెహ్రాడూన్, ముంబై, పూణె, సూరత్ వంటి నగరాల్లో సమర్థవంతంగా సేవలు అందిస్తున్నాయి.. పలు నగరాల్లోని ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తున్నందున సంబంధిత రవాణా సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Olectra Greentech Limited చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ KV ప్రదీప్ మాట్లాడుతూ “Olectra పూణేలో ప్రస్తుత 150 బస్సులకు మరో 150 ఎలక్ట్రిక్ బస్సులను అదనంగా చేర్చడం సంతోషంగా ఉందని తెలిపారు. పూణే యొక్క గొప్ప వారసత్వాన్ని కాపాడేందుకు తమ బస్సులు దోహదం చేస్తాయన్నారు. సమర్థవంతమైన విద్యుత్ ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ధ్వని కాలుష్యం, కర్బన ఉద్గారాలు తగ్గిపోతుందని తెలిపారు. మా ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే తమ విశ్వసనీయత, సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయని తెలిపారు.
అత్యాధునిక ఫీచర్లు
12 మీటర్ల ఎయిర్ కండిషన్డ్ బస్సులు 33+D సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్, ప్రతి సీటుకు యూఎస్‌బీ సాకెట్లను ఏర్పాటు చేశారు. ఈ బస్సులో లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీని వినియోగించారు. ఇది సింగిల్ చార్జిపై ట్రాఫిక్, ప్రయాణీకుల లోడ్ ఆధారంగా 200 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన బస్సులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇది బ్రేకింగ్ సమయంలో కోల్పోయిన గతిశక్తిలో కొంత భాగాన్ని తిరిగి పొందుతుంది. అధిక-పవర్ AC, DC ఛార్జింగ్ సిస్టమ్.. బ్యాటరీని 3-4 గంటల్లో పూర్తిగా రీఛార్జ్ చేయబడుతుంది.
For more videos visit Harithamithra