
Eco-friendly Holi 2026 : కెమికల్ రంగులకు బై-బై! ఇంట్లోనే హోలీ రంగులు తయారు చేయండి – ఈ ట్రిక్ మీకు తెలుసా?
Organic Holi Colours : రంగుల పండుగ హోలీ అంటేనే చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా కేరింతలు, సందడి వాతావరణం ఉంటుంది. అయితే మార్కెట్లో దొరికే రసాయన రంగులు మీ చర్మం, కళ్లు, జుట్టుకు తీవ్ర హాని కలిగించవచ్చు. చర్మ సమస్యలు, అలర్జీలు మాత్రమే కాదు, నీటి కాలుష్యానికి కూడా కారణమవుతున్నాయి.ఈ నేపథ్యంలో సహజంగా ఇంట్లోనే తయారు చేసుకునే సేంద్రీయ రంగులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పర్యావరణాన్ని కాపాడుతూ, ఆరోగ్యంగా హోలీ జరుపుకోవడానికి మీ వంటగదిలో దొరికే వస్తువులతోనే సురక్షితమైన రంగులను ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.ఆర్గానిక్ రంగులనే ఎందుకు వాడాలి?చర్మ రక్షణ: ఇవి చర్మంపై దద్దుర్లు లేదా అలర్జీలు కలిగించవు.పర్యావరణ హితం: ఇవి నీటిని లేదా భూమిని కలుషితం చేయవు.విషరహితం: ఎలాంటి టాక్సిక్ కెమికల్స్ ఉండవు కాబట్టి గ్రహానికి, మన శరీరానికి మేలు.తక్కువ ఖర్చు: వంటగది...

