Harithamithra Telugu News

Home Agricultue పశుసంవర్ధకం Ornamental fish training | అలంకరణ చేపల పెంపకంపై KVK శిక్షణ – గ్రామీణ యువతకు...

Ornamental fish training | అలంకరణ చేపల పెంపకంపై KVK శిక్షణ – గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశం –

0
Ornamental fish training

Ornamental fish training | ఘంట‌శాల‌ : గ్రామీణ యువతకు స్వయం ఉఘ‌పాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ఆధ్వర్యంలో అలంకరణ చేపల (Ornamental Fish) పెంపకం యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ డి. సుధారాణి మాట్లాడుతూ, అలంకరణ చేపల పెంపకం గ్రామీణ యువతకు మంచి స్వయం ఉపాధి మార్గమని తెలిపారు. తక్కువ పెట్టుబడితో, రోజువారీ పనులకు ఆటంకం లేకుండా అదనపు ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

అలంకరణ చేపల పెంపకంపై కీలక సూచనలు

ఈ సందర్భంగా మత్స్య శాస్త్రవేత్త జె. యశ్వంత్ కుమార్ అలంకరణ చేపల పెంపకంపై సాంకేతిక అంశాలను వివరించారు. మంచినీరు, సముద్ర నీటిలో లభించే అలంకరణ చేపల రకాలు, అక్వేరియం తయారీకి అవసరమైన సామగ్రి, అక్వేరియం (Aquarium) సైజును బట్టి గాజు పలకల మందం ఎంపిక, అక్వేరియం తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ రకాల అక్వేరియంల నిర్మాణ పద్ధతులు, చేపలకు అవసరమైన పోషక ఆహారం, నీటి నాణ్యత ప్రమాణాల ప్రాముఖ్యత, అలంకరణ చేపల పెంపకంలో నీటి నాణ్యత, సరైన ఆహారం, సరైన నిర్వహణ వంటి కీలక అంశాల గురించి వివరించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామీణ యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శిక్షణ ద్వారా కొత్త నైపుణ్యాలు నేర్చుకుని స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని శాస్త్ర‌వేత్త‌లు సూచించారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్  కోసం  X , ఫేస్​బుక్​ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Previous articleబిజ్లిరైడ్ & తెలంగాణ పోలీసుల ముందడుగు: 500 మంది మహిళలకు EV డ్రైవింగ్‌లో శిక్షణ! – Bijlride Women Empowerment
Next articleWarangal Market Yard Prices వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధరలు.. క్వింటాల్ మిర్చి ₹40,000
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here