Electric bike: భారత్ మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ డిజైన్.. 221 కి.మీ రేంజ్!
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల అభిరుచి మేరకు సరికొత్త వాహనాలను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా బెంగళూరు కు చెందిన Orxa ఎనర్జీస్ (Orxa Energies) సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ మాంటిస్ ను (Mantis) లాంచ్ చేసింది. ఈ మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ 11.5 కిలోల బరువు కలిగిన లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ బైక్ మోటారు 93Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది. కేవలం 8.9సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ బుకింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో మాంటిస్ డెలివరీలు మొదలవుతాయి.
డిజైన్, స్పెసిఫికేషన్స్
250cc సెగ్మెంట్ యూత్ ను ఆకట్టుకునేలా కొత్తగా ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లాంచ్ అయింది. దీని ధర(ఎక్స్-షోరూమ్ ధర) రూ. 3.60 లక్షలు. Orxa Mantis అనేది EV స్టార్టప్ నుంచి వచ...