
వెస్పా లాంటి PURE EPluto 7G
గంటకు 60కి.మీ వేగం.. 120కి.ర్ల రేంజ్హైదరాబాద్‌కు చెందిన ప్యూర్ఈవీ సంస్థ ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో PURE EPluto 7G మార్కెట్లో క్రేజీని సంపాదించుకుంది. ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం దీని సొంతం. డ్రైవర్ బరువు, రోడ్డు తీరును బట్టి ఈ వేగంలో మార్పు ఉంటుంది. ఇది ఒక్కసారి చార్జి చేస్తే సుమారు 120కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
వెస్పాలా రిట్రో లుక్ ..
PURE EPluto 7G స్కూటర్‌ను చూడగానే గతంలో ఓ వెలుగు వెలిగిన వెస్పా పెట్రోల్ స్కూటర్ గుర్తుకు వస్తుంది. పాత తరం రూపుతో ఆధునిక హంగుల కలయికతో దీనిని రూపొందించింది మన హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ ప్యూర్ ఈవీ. ముందు వెనక పసుపు రంగు ఇండికేటర్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇక హాండిల్ మధ్యలో డిజిటల్ ఎల్‌సిడి డిస్‌ప్లేలో స్పీడ్ , ఓడోమీటర్, టర్న్ ఇండికేటర్, బ్యాటరీ స్టేటస్ బార్స్ వంట...