Tuesday, December 3Lend a hand to save the Planet
Shadow

Tag: Seed Garden

Agri News | తెలంగాణలో సొంతంగా సీడ్‌ గార్డెన్‌ ఏర్పాటు

Agri News | తెలంగాణలో సొంతంగా సీడ్‌ గార్డెన్‌ ఏర్పాటు

Agriculture
హైదరాబాద్‌: భవిష్యత్ లో తెలంగాణలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి.. గురువారం రెండో రోజు పలు సంస్థలను సందర్శించారు. ప్రపంచంలోనూ అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్‌ ‌ఫామాయిల్‌ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్‌జీవీ కంపెనీకి చెందిన సీడ్‌ ‌గార్డెన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్ధతులతో ఉన్న విత్తన కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో సీడ్‌ ‌గార్డెన్ ఏర్పాటుకు ఎఫ్‌జీవీ కంపెనీ సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. అందుకు కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఎఫ్‌జీవీ కంపెనీ కర్మాగారాన్ని సందర్శించి అక్కడ తయారు చేసే వి...