Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు Poultry Vaccination : పెరటి కోళ్ల పెంపకంలో టీకాలతో రక్షణ – గ్రామీణ యువతకు ప్రత్యేక...

Poultry Vaccination : పెరటి కోళ్ల పెంపకంలో టీకాలతో రక్షణ – గ్రామీణ యువతకు ప్రత్యేక శిక్షణ

0
Backyard Poultry Vaccination

Poultry Vaccination : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో గురువారం కెవికె సమన్వయకర్త డాక్ట‌ర్‌ డి సుధారాణి ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు పెరటి కోళ్లలో సమయానుకూల టీకాలు ప్రాముఖ్యతపై శిక్షణ కార్యక్రమం కెవికె విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి నవీన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధారాణి గారు మాట్లాడుతూ.. పెరటి కోళ్ల పెంపకం లాభదాయకమని కొద్దిపాటి టీకాలు సూచనలు పాటిస్తే కోళ్లులో మరణాల రేటు తగ్గించి సక్సెస్ రేట్ ని చూడొచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త నవీన్ మాట్లాడుతూ పెరటి కోళ్లులో వచ్చే వ్యాధులను వివరిస్తూ వాటిని నివారించడానికి ఏ విధమైన టీకా కార్యక్రమాలు చేపట్టాలని రైతులకు సూచించి వివరించారు.

శాస్త్రవేత్త యశ్వంత్ మాట్లాడుతూ పెరటి కోళ్లలో గల వివిధ రకాల జాతులు, వాటి ప్రాముఖ్యత ఉపయోగాలు గురించి క్షుణంగా వివ‌రించారు. ఈ కార్యక్రమంలో కెవికె సమన్వయకర్త డాక్ట‌ర్ డి.సుధారాణి, శాస్త్రవేత్తలు డాక్టర్​ నవీన్, జె.యశ్వంత్, గ్రామీణ యువత పాల్గొన్నారు.


Previous articleSundarbans Mangrove plantation | ‘గ్రీన్’ విప్లవం – కేసీఆర్ జన్మదినం సందర్భంగా 10 వేల మడ మొక్కల పెంపకం !
Next articleMaruti Suzuki e Vitara ధరలు ఇవే.. ₹10.99 లక్షల నుంచే ఎలక్ట్రిక్ SUV.. బ్యాటరీ అద్దె ఆప్షన్ కూడా!
Kavya P
కావ్య‌. హ‌రిత‌మిత్ర‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. జ‌ర్న‌లిజంలో 16 ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఈమె వ్య‌వ‌సాయ రంగం, జీవ‌న‌శైలికి సంబంధించిన వార్త‌ల‌ను అందిస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here