వావ్… Smart Solar Hotel
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని గురుద్వారా జంక్షన్‌లో నిర్మించిన ఓ ప్రత్యేకమైన హోటల్ (Smart Solar Hotel )అందనినీ ఆకర్షిస్తుంది. హోటల్ భవనాన్ని కప్పేస్తూ ఏర్పాటు చేసిన అద్దాలు ఈ భవనానికి ప్రత్యేక అందాన్నితీసుకొచ్చాయి. ఈ సౌరకాంతితో మెరిసిపోతున్న ఈ అద్దాలు ఆకర్షణీయంగా కనిపించడమే కాదు. విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఈ సోలార్ ప్యానెల్స్‌తో ఈ హోటల్‌కు బయటి నుంచి కరెంట్ సరఫరా అవసరం లేదు. అంతేకాకుండా ఇక్కడ ఉత్పత్తయిన మిగులు విద్యుత్‌ను పవర్‌గ్రిడ్‌కు విక్రయిస్తున్నారు.
నారాయణరావు అలియాస్ బాబ్జీ ఈ సోలార్ హోటల్‌ను నిర్మించారు. ‘నమో ఇన్‌స్పైర్ ది స్మార్ట్ ఐఎన్‌ఎన్’ పేరుతో ఐదు అంతస్తుల భవనంలో 250 సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. నారాయణరావు చెప్పిన దాని ప్రకారం భవనానికి ప్యానెళ్లను బిగించేందుకు రూ. 15 లక్షలు ఖర్చయింది.Smart Solar Hotel లో సౌర ఫలకాల ద్వారా స...