Millets Farming | అందరూ ఈమెను ‘క్వీన్ ఆఫ్ మిల్లెట్స్’ పిలుస్తారు.. గిరిజన మహిళా రైతు ఘనత చూస్తే
queen of millets | ఒడిశాలోని గిరిజన భూమియా కమ్యూనిటీకి చెందిన 36 ఏళ్ల రైమతి ఘియురియా ఒక సాధారణ గిరిజన మహిళా రైతులా కనిపిస్తుంది. కానీ గతేడాది సెప్టెంబరు 9న న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో ఒడిశా తరపున ఆమె ప్రాతినిధ్యం వహించింది. కోరాపుట్ జిల్లాలో సంప్రదాయ వరి, చిరుధాన్యాల (millets) వంగడాలను సంరక్షించడంలో ఆమె అద్భుతమైన జీవన ప్రయాణాన్ని వివరించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సేంద్రియ రైతుగా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌గా, అనుభవజ్ఞుడైన శిక్షకురాలిగా ఆమె సాధించిన అద్భుతమైన విజయాలు వెలుగులోకి వచ్చాయి.. అయితే ఈ ఆదర్శ మహిళా రైతు గురించి మనమూ తెలుసుకుందాం..కుంద్రా బ్లాక్‌లోని నౌగూడ గ్రామానికి చెందిన రైమతి (Raimati Ghiuria ) తన భర్త గోబింద ఘియురియా, వారి ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. సేంద్రియ వ్యవసాయానికి కట్టుబడి , ఆమె 2500 మంది సహచర రైతులకు శిక్షణ ఇచ్చింది. సేం...