
వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
New Electric Buses: వరంగల్ రీజియన్‌లో టీజీఎస్ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో కొత్తగా 82 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు.ఎలక్ట్రిక్ బస్సుల్లో సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్‌ప్రెస్ (29) ఉన్నాయి. ఢిల్లీకి చెందిన JBM కంపెనీ ఈ బస్సులను కాంట్రాక్ట్ (Gross cost contract) ప్రాతిపదికన నడపడానికి అంగీకరించింది. గ్రేటర్ వరంగల్ రీజియన్ పరిధిలోని బస్సులను నిర్వహిస్తున్న వరంగల్-2 డిపోలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 41 సీటింగ్ సామర్థ్యం, డీలక్స్‌లో 2+2 సీటింగ్ ప్యాటర్న్‌లో 45 సీట్లు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 2+3 సీటింగ్ ప్యాటర్న్‌లో 55 సీట్లు ఉంటాయని, ముందు, వెనుక ఎయిర్ సస్పెన్షన్ ఉంటుందని అధికారులు తెలిపారు....