Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: thirupathi

ఇకపై కడప-తిరుమల రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు..

ఇకపై కడప-తిరుమల రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు..

Electric vehicles
ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించిన APSRTC ఛార్జీల వివరాలు ఇవిగో.. APSRTC Electric buses : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) కడప-తిరుమల మధ్య 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. కడప డిపోలో బస్సు సర్వీసులను కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి వీటిని ప్రారంభించారు. అంతకుముదు ఎలక్ట్రిక్ బస్సులకు కడప డిపోలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 12 బస్సుల్లో ఆరు బస్సులు నాన్‌స్టాప్‌ సర్వీస్‌గా ఉంటాయి. బస్సులు ఉదయం 4.30 నుంచి రాత్రి 7.30 వరకు నడుస్తాయి. బస్సు ఛార్జీలు పెద్దలకు రూ.340, పిల్లలకు రూ.260 గా నిర్ణయించారు.రాష్ట్రంలోని అన్ని డిపోలు క్రమంగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుకు మారనున్నాయి. మొదటి దశలో ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య 50, తిరుమల-రేణిగుంట విమానాశ్రయాల మధ్య 14, తిరుపతి-మాడ మధ్య 12 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి....