
EV Comparison | హీరో విడా VX2 vs ఓలా S1 Z రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెస్ట్.. ?
భారత్ లో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. నవంబర్ 2024లో వచ్చిన ఓలా S1 Z, మరోవైపు జూలై 1, 2025న విడుదలైన Hero Vida VX2 వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు ఆకర్షణీయ ధరలతో హీటెక్కిస్తున్నాయి.ధరలు & వేరియంట్లు ఇలా:హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ GO, Plus అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. GO మోడల్ ధర ₹99,490 కాగా, బాటరీ-యాజ్-అ-సర్వీస్ (BaaS) ప్లాన్‌తో కేవలం ₹59,490కే కొనుగోలు చేయవచ్చు. ఇక Plus వేరియంట్ ₹1,09,990 (బ్యాటరీతో), లేదా ₹64,990 (BaaS)గా ఉంది.మరోవైపు, ఓలా S1 Z రెండు ఎంపికల్లో వస్తోంది అందులో మొదటిది స్టాండర్డ్ (₹59,999) రెండోది Z+ (₹64,999). స్టాండర్డ్ వేరియంట్‌లో 1.5kWh రిమూవల్ బ్యాటరీ లభిస్తుంది. Z+ వేరియంట్‌కి పెద్ద డిస్‌ప్లే, అదనపు ఫీచర్లు ఉన్నాయి.బ్యాటరీ, పరిధి, ఛార్జింగ్ – ఏది బెస్ట్ ?హీరో విడా GO మోడల్ 2.2kWh బ్యా...