Xiaomi SU7 | షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జిపై 800 కిమీ రేంజ్..
Xiaomi SU7 | స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi తాజాగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును SU7 ను విడుదల చేసి ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించింది. మోడల్ పేరులోని “SU” అంటే “స్పీడ్ అల్ట్రా” అని అర్థం. ఆవిష్కరణ సమయంలో Xiaomi SU7 కి సంబంధించిన అధికారిక చిత్రాలను ప్రదర్శించడం తోపాటు ఈ ఎలక్ట్రిక్ కారు వివరాలను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారును BAIC గ్రూప్ యాజమాన్యంలోని ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఏడాదికి సుమారు రెండు లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది.టెస్లా వంటి ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలోని అగ్రశ్రేణి మోడళ్లకు ఈ కొత్త కారు సవాలుగా నిలిచింది. SU7 మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవిSU7
SU7 ప్రో
SU7 మ్యాక్స్Xiaomi SU7 దాని సొగసైన, ఆధునిక, స్పోర్టీ డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. Xiaomi కారు Hyper OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో ...