Thursday, July 3Lend a hand to save the Planet
Shadow

Tata Harrier EV | టాటా హారియర్ EV బుకింగ్స్ ప్రారంభం – ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు!

Spread the love

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారియర్ EV (Tata Harrier EV) ని టాటా మోటార్స్ ప్రారంభించింది. స్వదేశీ కార్ల తయారీ సంస్థ ఈ ఎలక్ట్రిక్ SUV ధరలను దశల వారీగా ప్రకటించింది. మొదట, టాటా హారియర్ EV బేస్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఆ తరువాత SUV కి సంబంధించి అన్ని సింగిల్-మోటార్, రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. చివరగా, టాటా కొన్ని రోజుల క్రితం హారియర్ EV డ్యూయల్-మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధరలను సైతం వెల్ల‌డించింది.

చాలా కాలం తర్వాత, ఆసక్తిగల కొనుగోలుదారులు ఇప్పుడు హారియర్ EV బుకింగ్‌లను ప్రారంభించవచ్చు. టాటా మోటార్స్ పూర్తిగా విద్యుత్‌తో నడిచే హారియర్ కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. 65 kWh మరియు 75 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ Tata.ev వెబ్‌సైట్, లేదా అధీకృత కంపెనీ షోరూమ్‌ల ద్వారా బుకింగ్‌లను స్వీకరిస్తోంది. అన్ని టాటా హారియర్ EV వేరియంట్‌ల ధరలను కింద ప‌ట్టిక‌లో చూడ‌వ‌చ్చు.

అయితే ఈ ధరలలో ఛార్జర్ ధర, దాని ఇన్‌స్టాలేషన్ లేవ‌ని గ‌మ‌నించాలి. టాటా హారియర్ EV కొనుగోలుపై ఇప్పటికే ఉన్న టాటా EV యజమానులకు లక్ష రూపాయల లాయల్టీ బోనస్‌ను కూడా అందిస్తోంది. టాటా హారియర్ EV అడ్వెంచర్ 65, అడ్వెంచర్ S 65, ఫియర్‌లెస్+ 65, ఫియర్‌లెస్+ 75, ఎంపవర్డ్ 75, ఎంపవర్డ్ 75 AWD అనే ఆరు ట్రిమ్‌లలో (పర్సనాస్) అందుబాటులో ఉంటుంది.

టాటా హారియర్ EV నాలుగు రంగులలో ల‌భిస్తోంది. అవి ఎంపవర్డ్ ఆక్సైడ్, నైనిటాల్ నాక్టర్న్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే. ఈ క‌ల‌ర్ ఆప్ష‌న్స్ తోపాటు టాటా హారియర్ EV స్టీల్త్ ఎడిషన్‌ను కూడా అందిస్తుంది. దీని ధర సంబంధిత స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ. 75,000 ఎక్కువ.

Tata Harrier EV : వేరియంట్ల వారీగా ధరల వివరాలు..

Persona (RWD)Price (All prices are ex-showroom, pan-India)
అడ్వేంచర్ 65Rs 21.49 Lakh
అడ్వేంచర్ S 65Rs 21.99 Lakh
ఫియర్ లెస్ + 65Rs 23.99 Lakh
ఫియర్ లెస్ + 75Rs 24.99 Lakh
ఎంపవర్డ్ 75Rs 27.49 Lakh
ఎంపవర్డ్ 75 QWDRs 28.99 Lakh

Tata Harrier EV : బ్యాటరీ & మోటార్ స్పెక్స్

65 kWh బ్యాటరీ ప్యాక్ హారియర్ EV యొక్క రియర్-వీల్-డ్రైవ్ (RWD) వేరియంట్‌లతో ప్రత్యేకంగా అందించబడుతుంది. అయితే పెద్ద 75 kWh యూనిట్ RWD, ఆల్-వీల్-డ్రైవ్ (AWD) కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉంది. ARAI సర్టిఫికేషన్ ప్రకారం, 65 kWh వేరియంట్ సింగిల్‌ ఛార్జ్‌పై 538 కి.మీ రేంజ్‌ ని అందిస్తుంది. అయితే, టాటా దాని రియ‌ల్ రేంజ్ 420 మరియు 455 కి.మీ మధ్య ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు, 75 kWh బ్యాటరీ RWD సింగిల్-మోటార్ సెటప్‌తో 627 కి.మీ, AWD డ్యూయల్-మోటార్ వేరియంట్‌లతో 622 కి.మీ క్లెయిమ్డ్ రేంజ్‌ను అందిస్తుంది.

పనితీరు పరంగా, RWD వెర్షన్లు 235 bhp, 315 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. 75 kWh బ్యాటరీతో నడిచే AWD వేరియంట్లు 309 bhp మరియు 504 Nm పీక్ టార్క్‌ను కలిపి ఉత్పత్తి చేస్తాయి. హారియర్ EV ఎలక్ట్రానిక్‌గా పరిమితమైన గరిష్ట వేగాన్ని 180 kmph కలిగి ఉంది. కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు వేగాన్ని అందుకుంటుంది.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *