TATA Nano EV : భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో టాటా కంపెనీకి చెందిన టాటా నానో ఈవీ భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని టాటా కంపెనీ ఈ కారులో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం, టాటా హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో, SUV నెక్సాన్ కూడా సరసమైన ఈవీ సెగ్మెంట్‌లో చాలా పాపులర్ అయ్యాయి.
భారతదేశంలో సరసమైన ఎలక్ట్రిక్ కార్లకు ఈవీలకు టాటా బ్రాండ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీని ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వాహనం టియాగో రూ. 8 నుంచి 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. మరింత తక్కువ ధరలో ఈవీల కోసం చూసేవారికి టాటా నానో ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. అనేక కారణాల వల్ల టాటా కంపెనీ 2018లో నానో కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది.ఆ తర్వాత టాటా నానో కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌పై పని చేయడం ప్రారంభించింది. 2015 సంవత్సరంలో టాటా నానోకు సంబంధించి కొన్ని కంపెనీలతో కంపెనీ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.
తక్కువ ధరలోనే టాటా నానో ఈవీ
టాటా నానో ఈవీని మరింత సరసమైన ధరకు రూపొందించి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. 2022లో ఎలక్ట్రా ఈవీ అనే కంపెనీ, టాటా నానోలో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను తిరిగి అమర్చింది. 2024 ప్రారంభంలో టాటా, ఎంజీ మోటార్ బ్యాటరీ పరికరాల ధర తగ్గడం వల్ల తమ ఎలక్ట్రిక్ వాహనాల రేట్లను తగ్గించాయి.. ప్రస్తుతం, ఎంజీ కామెట్ ఈవీ వెహికల్స్ లో చౌకైనది, ఇది రూ. 7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే టియాగో ఈవీ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ దిల్లీ). టాటా నానో ఈవీకి దాదాపు రూ. 6 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను నిర్ణయించే చాన్స్ ఉంది.
టాటా నానో ఈవీ ఫీచర్లు
TATA Nano EV లో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్స్ విండోస్, ఏసీ, బ్లూటూత్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, రిమోట్ లాకింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. టాటా నానో ఈవీ 17 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సింగిల్ చార్జ్‌పై 312 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 80 వేగంతో వెళ్లగలదు. ఈ వాహనం 10 సెకన్లలోనే 0-100 వేగాన్ని అందుకుంటుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 నుండి 8 గంటల సమయం పట్టవచ్చు. ఇంటీరియర్ స్పేస్ కూడా కాస్త ఎక్కువగానే ఉండనుంది. సులభంగా నలుగురు కూర్చునేలా ఇంటీరియర్ డిజైన్ చేశారు.
బ్యాటరీతో పాటు రెండు ఛార్జింగ్ ఎంపికల్లో అందుబాటులో ఉండనుంది. 15A సామర్థ్యంతో ఒక హోమ్ ఛార్జర్, మరొకటి DC ఫాస్ట్ ఛార్జర్. అద్భుతమైన డిజైన్‌తో వస్తున్న టాటా నానో ఈవీ కాంపాక్ట్ కారు 3,164ఎమ్ఎమ్ పొడవు, 1,750ఎమ్ఎమ్ వెడల్పు, 2,230ఎమ్ఎమ్ వీల్ బేస్, 180ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..