Tata Nano EV: ఒక్కసారి చార్జి చేస్తు పై 300కి.మీ… మతిపోగొడుతున్న టాటా నానో ఫీచర్స్ ..!
TATA Nano EV : భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో టాటా కంపెనీకి చెందిన టాటా నానో ఈవీ భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని టాటా కంపెనీ ఈ కారులో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం, టాటా హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో, SUV నెక్సాన్ కూడా సరసమైన ఈవీ సెగ్మెంట్‌లో చాలా పాపులర్ అయ్యాయి.భారతదేశంలో సరసమైన ఎలక్ట్రిక్ కార్లకు ఈవీలకు టాటా బ్రాండ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీని ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వాహనం టియాగో రూ. 8 నుంచి 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. మరింత తక్కువ ధరలో ఈవీల కోసం చూసేవారికి టాటా నానో ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. అనేక కారణాల వల్ల టాటా కంపెనీ 2018ల...