Nexon, Harrier, Safari SUVలలో ప్రత్యేక ‘JET’ ఎడిషన్ వెర్షన్‌లను పరిచయం చేసిన టాటా మోటార్స్.. తాజాగా Nexon EVకి కూడా అదే ట్రీట్‌మెంట్‌ను అందించింది. Tata Nexon EV JET ఎడిషన్ భారతదేశంలో రూ. 17.50 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభించింది. దీని ఎలక్ట్రిక్ SUV యొక్క ప్రైమ్, మాక్స్ వెర్షన్‌లతో అందుబాటులో ఉంది.
కొత్త Tata Nexon EV JET ఎడిషన్ ప్రత్యేకతల విషయానికొస్తే ఇది ఒక స్పెషల్ ఎడిషన్ వెర్షన్. యూనిక్ స్టార్‌లైట్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో ప్లాటినం సిల్వర్ రూఫ్‌తో పాటు మట్టి రంగుతో షేడ్ ఉంటుంది. JET ఎడిషన్ కూడా బ్లాక్ అవుట్ అల్లాయ్ వీల్స్, ORVMలను కలిగి ఉంటుంది.
ఇక లోపలి భాగంలో టాటా డ్యాష్‌బోర్డ్‌లు. డోర్‌లపై బ్రౌంజ్ ఇన్‌సర్ట్‌లతో డ్యూయల్-టోన్ వైట్- బ్లాక్ లేఅవుట్‌తో Nexon EV JET ఎడిషన్ వస్తుంది. కారు సీట్ హెడ్‌రెస్ట్‌లపై #JET బ్రాండింగ్‌తో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి.
Nexon EV ప్రైమ్ ఎలక్ట్రిక్ మోటారు 30.2 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 129 PS పవర్, 245 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 312 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. స్టాండర్డ్ 15 A ప్లగ్ పాయింట్ ద్వారా ఎలక్ట్రిక్ SUVని 10% నుండి 90% వరకు ఛార్జ్ చేయడానికి 9 గంటల 10 నిమిషాలు పడుతుంది. అయితే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా బ్యాటరీని ఒక గంటలో 10% నుండి 80% వరకు ఛార్జ్ చేస్తుంది.
ఇక Nexon EV Max 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 6.5 గంటల్లో 0 నుండి 100% వరకు చార్జ్ చేస్తుంది. 50 kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 56 నిమిషాలలోనే 0 నుండి 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఇందులో 40.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. Nexon EV మ్యాక్స్‌లోని ఎలక్ట్రిక్ మోటారు 143 PS గరిష్ట శక్తిని, 250 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది, SUV కేవలం 9 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు వేగంగా దూసుకుపోతుంది.
[…] 10 లక్షలు ఉండవచ్చు. భారతదేశంలో టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3 లకు గట్టిపోటీ […]