Top 6 most affordable electric cars | భారతదేశంలో అత్యంత చవకైన టాప్ 6 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి ఫీచర్లు ఇవే..

Spread the love

Top 6 most affordable electric cars | ఆటోమొబైల్ పరిశ్రమ ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతుండడంతో ప్రజలు కూడా ఈవీల వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు ఎంట్రీ లెవల్ విభాగంపై మొగ్గు చూస్తుండడంతో భారతీయ మార్కెట్ లో అనేక కంపెనీలు తక్కువ ధరకే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చాయి.
జనవరి 17న టాటా పంచ్ EV ప్రారంభమవుతున్న నేపత్యంలో ప్రస్తుతం దేవీయ ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం..

MG Comet EV: రూ. 7.98 లక్షలు – రూ. 9.98 లక్షలు

MG మోటార్ గత సంవత్సరం కాంపాక్ట్ 3-డోర్ల కామెట్‌ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ZS EV తర్వాత ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో రెండో ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ మైక్రో ఎలక్ట్రిక్ హాచ్ బ్యాక్ ..42 bhp, 110 Nm టార్క్ అవుట్‌పుట్‌తో 17.3 kWh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ARAI ప్రకారం, కామెట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. 3.3 kW ఛార్జర్‌తో ఇది ఏడు గంటల్లో 0 నుంచి 100 శాతం చార్జ్ అవుతుంది. 5.5 గంటల్లో 0 నుండి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది.

Tata Tiago EV: రూ. 8.69 లక్షలు – రూ. 12.04 లక్షలు

టాటా టియాగో 19.2 kWh, 24 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఎంట్రీ-లెవల్ టియాగో 60.3 బిహెచ్‌పి, 110 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. టాప్ మోడల్ 74 బిహెచ్‌పి మరియు 114 ఎన్ఎమ్ టార్క్ కలిగి ఉంది. MIDC సైకిల్ ప్రకారం 19.2 kWh బ్యాటరీ వెర్షన్ 250 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. ఇక 24 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 350 కి.మీ రేంజ్ ఇస్తుంది.
15A ప్లగ్-ఇన్, AC హోమ్ వాల్ ఛార్జర్‌తో, మొదటి వేయింట్ Tiago EV ట్రిమ్ 6.9 గంటల్లో 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 7.2 kW ఛార్జర్‌తో 8.7 గంటల్లో చార్జ్ అవుతుంది.
రెండో వేరియంట్ 24kWh టియాగో 2.6 గంటల్లో 10 – 100 శాతం, అలాగే 3.6 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

Citroen eC3: రూ 11.61 లక్షలు – రూ 12.49 లక్షలు

ఫ్రెంచ్ కార్‌మేకర్ Citroen తన మొదటి ఎలక్ట్రిక్ కారును గత సంవత్సరం eC3 పేరుతో భారతదేశంలో విడుదల చేసింది. క్రాస్ఓవర్ హాచ్ 76 bhp, 143 Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఇందులో 29.2 kW బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. eC3 టాప్ స్పీడ్ 107 kmph తో దూసుకుపోతుంది. 6.8 సెకన్లలో 0-60 kmph వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. 15amp ప్లగ్ పాయింట్‌తో, eC3 10 గంటల 30 నిమిషాల్లో 10-100 శాతం ఛార్జ్ చేస్తుంది. DC ఫాస్ట్ ఛార్జర్ 57 నిమిషాల్లో 10-80 శాతం చార్జ్ చేస్తుంది. MIDC సైకిల్ ప్రకారం, eC3 320km రేంజ్ ను అందిస్తుంది.

Tata Tigor EV: రూ. 12.49 లక్షలు — రూ. 13.75 లక్షలు

Tigor EV మార్కెట్‌లో అత్యంత పాకెట్ ఫ్రెండ్లీ EV సెడాన్. EV 74 bhp, 170 Nm టార్క్ ఉత్పత్తి చేసే మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. టాటా మోటార్స్ ప్రకారం.. ఇది 5.7 సెకన్లలో 0-60 kmph వేగాన్ని అందుకుంటుంది. ARAI ఆధారంగా, EV సెడాన్ సింగిల్ చార్జిపై 315 కిమీ రేంజ్ ను అందిస్తుంది. 15 A ప్లగ్ లేదా AC హోమ్ వాల్ ఛార్జర్‌తో ఇందులోని 26kWh బ్యాటరీని 10 నుండి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. ఇందుకు 9.4 గంటలు పడుతుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌తో ఇది 59 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జర్ అవుతుంది.

Tata Nexon EV : రూ. 14.74 లక్షలు — రూ. 19.94 లక్షలు

Tiago EV వలె, Nexon EV మీడియం రేంజ్ (MR), లాంగ్ రేంజ్ (LR) బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. MR 123 bhp, 215 Nm తో 30kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 9.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. MIDC సైకిల్ ప్రకారం సింగిల్ చార్జిపై 325 కిమీ రేంజ్ ను అందిస్తుంది. ఇక LR వేరియంట్ 143 bhp, 215 Nm అవుట్‌పుట్‌తో పెద్ద 40.5kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 8.9 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. MIDC సైకిల్ ప్రకారం 465 కిమీ పరిధిని అందిస్తుంది.

MR వెర్షన్ 10.5 గంటలలో 15A ప్లగ్ పాయింట్ నుండి 10 నుండి 100 శాతం ఛార్జ్ చేస్తుంది, 7.2kW AC ఛార్జర్‌తో 4.3 గంటలు పడుతుంది. 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో MR, LR రెండింటికీ ఛార్జింగ్ సమయం 56 నిమిషాలకు తగ్గుతుంది. మరోవైపు LR ట్రిమ్, 7.2kW AC ఛార్జర్‌తో 15 గంటల, 6 గంటలలో 15A ప్లగ్ పాయింట్ నుండి 10 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.

Mahindra XUV400 Pro : రూ 15.49 లక్షలు — రూ 17.49 లక్షలు

మహీంద్రా ఫేస్‌లిఫ్టెడ్ XUV400ని విడుదల చేసింది, XUV400 ప్రోగా రీబ్రాండ్ చేసింది. గత వారం రూ. 15.49 లక్షల ప్రారంభ ధరతో వచ్చింది. ఇది అవుట్‌గోయింగ్ మోడల్ కంటే చాలా ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది. Nexon EV మాదిరిగా, XUV400 రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 34.5 kWh మరియు 39.4 kWh బ్యాటరీ. వీటి రేంజ్ లు వరుసగా 375 km, 456 km (రెండూ ARAI రేట్ .
XUV400 లోని ఎలక్ట్రిక్ మోటార్ 148 bhp మరియు 310 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. పనితీరు విషయానికొస్తే, కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV గరిష్టంగా 150 kmph వేగాన్ని అందుకోగలదు. కేవలం 8.3 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..