తెలంగాణలో ఈ సంవత్సరం వన మహోత్సవం (Vanamahotsavam) కింద సుమారు 33,320 మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశించుకుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ నిన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గొల్లగూడెంలో వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గొల్లగూడెంలోని అటవీ భూమిలో 33,320 మొక్కలు నాటే కార్యక్రమం మంత్రులు చేపట్టారు. అనంతరం అటవీ ఉత్పత్తుల స్టాల్, ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఆ
ఈ సందర్భంగా మంతి కొండా సురేఖ మాట్లాడుతూ.. 1959లో కేంద్రమంత్రి కేఎం మున్షి వన మహోత్సవానికి (Vanamahotsavam) నాంది పలికారని అన్నారు. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకొని, ప్రతీ జిల్లాకు నిర్దేశిత లక్ష్యాన్ని ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 14,000 నర్సరీల్లో 22 కోట్ల మొక్కలను సిద్ధం చేశారు. ప్రతి శాఖకు లక్ష్యం మేరకు మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు. మొక్కను నాటి, సంరక్షిస్తే జీవితకాలం ఆక్సిజన్ తోపాటు, పండ్లు, ఫలాలు అందిస్తాయని మంత్రి తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..