Harithamithra Telugu News

Vegetable farming income farmers

Vegetable Farming | రాష్ట్రంలో కూరగాయల కొరతకు చెక్: 800 మంది రైతులను ‘వెజిటబుల్ వాలంటీర్లు’గా తయారు చేస్తాం

Vegetable Farming Telangana | రాష్ట్రంలో కూరగాయల కొరత (Vegetable shortage) స‌మ‌స్య‌ను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 మందికి పైగా రైతులను ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహ‌న్ (Surendra Mohan) తెలిపారు.
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం ( Professor Jayashankar Telangana State Agricultural University ) పరిధిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కూరగాయల పంటపై 44వ వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Vegetable Farming 1

రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం

రైతుల ఆదాయం రెండింతలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆధునిక సాగు పద్ధతులను రాష్ట్ర రైతులకు పరిచయం చేసి కూరగాయల ఉత్పాదకత పెంచుతామని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగంగా ఉద్యాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యాన రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో రైతుల పాత్ర కీలకమని, ముఖ్యంగా నేలలో కర్బన శాతం పెంచడం ద్వారా దిగుబడులను మెరుగుపరచవచ్చని సూచించారు. ప్రస్తుతం నేలలో కర్బన శాతం కేవలం 0.3 శాతం మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా Indian Council of Agricultural Research అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాకర్ పాండే మాట్లాడుతూ, దేశంలో ఉద్యాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం ఉద్యాన పంటల విలువ రూ.7.6 లక్షల కోట్లకు చేరుకుందని, రాబోయే సంవత్సరాల్లో ఈ రంగం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కూరగాయల అభివృద్ధికి ఆధునిక సాంకేతికతలు కీలకమని, స్పీడ్ బ్రీడింగ్, జీనోమ్ ఎడిటింగ్ వంటి పద్ధతులను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం గత కొన్నేళ్లలో గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు. ఒకప్పుడు మూడు లక్షల ఎకరాల్లో సాగు జరగగా ప్రస్తుతం అది ఒక లక్ష ఎకరాలకు పడిపోయిందని చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సాగు విస్తీర్ణాన్ని మళ్లీ పెంచేందుకు రైతులకు ప్రత్యేక శిక్షణ అవసరమని సూచించారు.

Vegetable Farming : శిక్షణతో కూరగాయల ఉత్పత్తి పెంపు

Indian Institute of Vegetable Research డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, గత ఐదు దశాబ్దాల్లో 640 కొత్త కూరగాయల రకాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అధిక దిగుబడి, వైరస్ నిరోధక లక్షణాలు కలిగిన రకాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిని పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరల్లో కూరగాయలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.


Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు

Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates