అంతర్జాయతీ స్థాయిలో గుర్తిపు పొందిన ద్విచక్రవాహనాల తయారీ సంస్థ యమహా (Yamaha) మార్కెట్లో ప్రపంచ మార్కెట్ కోసం రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది.
యమహా నియో (Yamaha Neo),
యమహ ఈ01 (Yamaha E01) ఎలక్ట్రిక్ స్కూటర్.
Yamaha electric scooters ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయి. కంపెనీ వీటిని రానున్న రోజుల్లో ముందుకు తీసుకురానుంది.
యమహా ఇప్పటికే 50సీసీ పెట్రోల్‌తో నడిచే నియో స్కూటర్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అతిపెద్ద హైలైట్.. బ్యాటరీ ఎక్స్చేంజ్ టెక్నాలజీ. ఇది రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. అలాగే ఇది హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పరిగెడుతుంది.
Yamaha electric scooters లోని నియో ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా వస్తుందని భావిస్తున్నారు.
యమహా ఈ01 (Yamaha E01)
యమహా కంపెనీ విడుదల చేయనున్న రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా ఈ01 (Yamaha E01) ఎలక్ట్రిక్ విషయానికి వస్తే, ఇది కూడా ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది. ఇది 125సిసి పెట్రోల్ స్కూటర్‌తో సమానంగా ఉన్న శక్తివంతమైన స్కూటర్. ఇది ఈ01 కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుంది. E02 కాన్సెప్ట్ వలె అదే ఈవెంట్‌లో ప్రదర్శించబడింది.
ఇప్పటికే కొన్ని జపాన్ మీడియా సంస్థలు ఈ స్కూటర్ యొక్క ఫీచర్లను ఇప్పటికే వెల్లడించాయి. ఈ01 ఎకో, నార్మల్, పవర్‌తో సహా మూడు రైడ్ మోడ్‌లను క లిగి ఉంటుంది. బ్యాటరీ స్టేటస్, స్పీడ్ మొదలైన ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శించే ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది.
అంతే కాకూండా ఇందులో కీలెస్ ఇగ్నిషన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కూడా ఈ స్కూటర్‌లో ఇవ్వవచ్చు. ఈ01 ఇ-స్కూటర్‌ను యూరప్‌లోని నగరాల్లో రైడ్-షేరింగ్ వెహికల్ గా విడుదల చేసే అవకాశం ఉంటుంది. యమహా ఈ స్కూటర్‌ని విడుదల చేయడానికి ముందు టెస్టింగ్ చేస్తుంది. ప్రతి వాహనానికి ఈ టెస్టింగ్ అనేది చాలా అవసరం.
యమహా ఈ01 (Yamaha E01) ఎలక్ట్రిక్ స్కూటర్ ఐరోపాలో అరంగేట్రం చేసినందున, లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెగ్యులేటరీ క్లాస్ ప్రకారం దీని పవర్ 11kW వద్ద పరిమితం చేయబడే అవకాశం ఉంది. కంపెనీ ఇటీవల తన ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసినందున Yamaha E01 ని భారత మార్కెట్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.
యమహా కంపెనీ త్వరలో మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది. ఇప్పటికే మార్కెట్లో యమహా ప్రత్యర్థి కంపెనీలు Hero , Tvs motors, అలాగే Bajaj కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి. అవి మార్కెట్‌లో ఫుల్ సక్కెస్ అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో Yamaha కంపెనీ కూడా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
For Tech News in Telugu Please visit : Techtelugu.in
[…] బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందు, వెనుక చక్రాల వద్ద హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. అలాగే 3.5 ”ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. […]