Bajaj Chetak 2024 : 2024 కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా మొదలుపెట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto). ఈ నేపథ్యంలోనే .. 2024 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. జనవరి 9న ఈ అప్డేటెడ్ ఈ-స్కూటర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాం..
2024 బజాజ్ చేతక్ ఈవీ..
Bajaj Chetak 2024 ఈ అప్డేటెడ్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, మెకానికల్స్‌లో భారీ మార్పులు కనిపిస్థాయని తెలుస్తోంది. ఇందులో 3.2 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాట్రీ ప్యాక్ ఉండనుంది. ప్రస్తుతం ఉన్న మోడల్లో 2.88 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ యూనిట్ ఉంది. అంతేకాకుండా .. ప్రస్తుతం ఈ వెహికిల్ ర 113 కి.మీ రేంజ్ ఇస్తుంది . ఇక బ్యాటరీ సామర్థ్యం పెరుగుతుండటంతో.. కొత్త బజాజ్ చేతక్ ఈవీ రేంజ్ కూడా పెరుగుతుంది. దీని రేంజ్ సుమారు 130 కి.మీలుగా ఉంటుందని సమాచారం.
Bajaj Chetak Electric scooter price in Hyderabad : మీడియాలో లీక్ అయిన సమాచారం ప్రకారం.. 2024 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ టైమ్ 4. 30 గంటలు.. ఈ సమయంలో 0-100శాతం పూర్తిగా ఛార్జింగ్ అయిపోతుంది.
ఇక అప్డేటెడ్ బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ గంటకు 75 కిలోమీటర్ల దూసుకుపోతుందని తెలుస్తోంది.
సూపర్ ఫీచర్స్‌తో బజాజ్ చేతక్!
ఇక 2024 బజాజ్ చేతక్ ఈవీలో పలు ఆసక్తికరమైన స్మార్ట్ ఫీచర్స్ చేరుస్తున్నారని సమాచారం. ఇందులో ముఖ్యంగా సరికొత్త టీఎఫ్టీ స్క్రీన్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మోడళ్లలో సర్క్యులర్ ఎల్సీడీ యూనిట్ ఉంది.
Bajaj Chetak Electric scooter review : బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని స్క్రీన్‌లో టర్న్ బై టర్న్ నేవిగేషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రిమోట్ లాక్- అన్‌లాక్, బ్లూటూత్ కనెక్టివిటీ తో పాటు మరికొన్ని ఫీచర్స్ ఉంటాయని సమాచారం. 18 లీటర్లు ఉన్న బజాజ్ చేతక్ ఈవీ అండర్ సీట్ స్టోరేజ్- 21 లీటర్లకు పెరిగిందట.
బజాజ్ చేతక్ ధర..
ప్రస్తుతం.. ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 1.27 లక్షలుగా ఉంది. ఇక అప్డేటెడ్ వెర్షెన్ ధర ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చని సమాచారం.
2024 Bajaj Chetak EV : అయితే 2024 బజాజ్ చేతక్ ఈ- స్కూటర్.. ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా.. ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటు లో లేవు. జనవరి 9న జరిగే లంచ్ ఈవెంట్లో పూర్తి వివరాలపై ఓ క్లారిటీ వస్తుంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..