Friday, August 22Lend a hand to save the Planet
Shadow

2025 Tata Punch EV: కొత్త కలర్స్, ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన రేంజ్ – ధరలు & ఫీచర్లు

Spread the love

2025 Tata Punch EV Details : భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUV అయిన పంచ్ EV కి సంబంధించి టాటా మోటార్స్ రెండు అత్యంత కీల‌క‌మైన అప్‌డేట్స్ ను విడుదల చేసింది. అందులో రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి వ‌చ్చింది. – ప్యూర్ గ్రే సూపర్నోవా కాపర్. ఫియర్‌లెస్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, డేటోనా గ్రే, సీవీడ్, ప్రిస్టైన్ వైట్‌తో సహా ఇప్పటికే ఉన్న క‌ల‌ర్ ఆప్ష‌న్స్ కూడా కొనసాగుతున్నాయి.

మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ దాని ఛార్జింగ్ సిస్టమ్‌. ఇది ఇప్పుడు వేగవంతమైన ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌ ఇస్తుంది. Punch.ev ఇప్పుడు 1.2C రేటుతో ఛార్జ్ చేస్తుంది, దీని వలన కస్టమర్‌లు తమ EVని కేవలం 40 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలరు. 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 15 నిమిషాల్లో 90 కి.మీ. దూరాన్ని ప్ర‌యాగ‌నించ‌గ‌ల‌రు.ఇక వాహనానికి ఇతర మార్పులు చేయలేదు.

బ్యాటరీ ఎంపికలు

టాటా పంచ్ EV రెండు బ్యాటరీ ఎంపికలను అందిస్తోంది. 25kWh మరియు 35kWh, వరుసగా 315km, 421kM (MIDC రేంజ్‌) రేంజ్‌ని కలిగి ఉంటాయి. హోమ్ ఛార్జింగ్ కోసం, 3.3kW, 7.2kW ఛార్జర్‌లు అందుబాటులో ఉన్నాయి. పంచ్ EV LR వేరియంట్‌లు 122 hp, 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి, అయితే స్టాండర్డ్ వేరియంట్‌లు 82hp, 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

2025 Tata Punch EV ముఖ్యమైన స్పెసిఫికేష‌న్స్‌

  • హర్మాన్ వైర్‌లెస్ ద్వారా 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే
  • వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్
  • 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
  • 360-డిగ్రీ కెమెరా
  • బ్లైండ్ స్పాట్ మానిటర్
  • లెథెరెట్ సీట్లు
  • వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
  • Arcade.ev – యాప్ సూట్
  • ఆటో ఫోల్డ్ ఫంక్షన్‌తో పవర్డ్ ORVMలు
  • AQI డిస్‌ప్లేతో ఎయిర్ ప్యూరిఫైయర్
  • ఆటో-డిమ్మింగ్ IRVM
  • ఫ్రంట్, రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్
  • కీలెస్ ఎంట్రీ అండ్ గో
  • లెదర్-వ్రాప్డ్ స్టీరింగ్ సన్‌రూఫ్
  • 3 డ్రైవ్ మోడ్‌లు
  • హిల్ డీసెంట్ కంట్రోల్
  • ఆటోహోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
  • LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఫాలో మీ హోమ్ ఫంక్షన్‌తో
  • కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఫాగ్ లాంప్స్
  • సీక్వెన్షియల్ ఇండికేటర్స్
  • 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్

2025 Tata Punch EV ధరలు

Tata Punch.ev ప్రస్తుతం ధర రూ.9.99 లక్షల నుండి రూ.14.44 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. MG Windsor EV. Comet EV పంచ్ EV కి బ‌ల‌మైన‌ పోటీదారులుగా ఉండగా, Nexon EV, Tata Tiago EV కూడా మార్కెట్ లో ఆద‌ర‌ణ పొందాయి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు