Home » EVల కోసం టాటా మోటార్స్ 7,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. BPCLతో కీలక ఒప్పందం

EVల కోసం టాటా మోటార్స్ 7,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. BPCLతో కీలక ఒప్పందం

BPCL Tata motors
Spread the love

ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సమస్యలు తొలగించేందుకు Tata ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM) కీలక అడుగు వేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా 7,000 భారత్ పెట్రోలియం పెట్రోల్ పంపుల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఈ రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.

Tata EV యజమానులు పబ్లిక్ ప్రదేశాలలో ఛార్జర్‌లను ఏర్పాటు చేయడానికి గాను భారత్ పెట్రోలియం కార్పొరేషన్  చెందిన పెట్రోల్ బంకులను ఉపయోగించుకుంటాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వచ్చే ఏడాది నాటికి 7,000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు మైలేజీ-రేంజ్ టెన్షన్ లేకుండా BPCL దేశవ్యాప్తంగా 90కి పైగా ఎలక్ట్రిక్ వెహికల్ ఫాస్ట్ ఛార్జింగ్ హైవే కారిడార్‌లను ప్రారంభించింది. ప్రధాన రహదారులకు ఇరువైపులా ప్రతీ 100 కి.మీ.కు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ ఉంటుంది.  ఈ కారిడార్లు వివిధ రహదారులపై 30,000 కి.మీ కంటే ఎక్కువ విస్తరించి ఉన్నాయి. ఇవి ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయి.

TPEM మరియు BPCL మధ్య ఈ ఒప్పందం.. టాటా EV యజమానులకు చక్కని రైడింగ్  అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండు కంపెనీలు సహ-బ్రాండెడ్ RFID కార్డ్ ద్వారా ఈజీ చెల్లింపు వ్యవస్థను పరిచయం చేయనున్నాయి.

BPCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్‌ఛార్జ్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ..  కంపెనీ తన సంప్రదాయ రీటైల్ అవుట్‌లెట్‌లలో 7,000ని చార్జింగ్ కేంద్రాలుగా మార్చే లక్ష్యానికి చేరుతోందన్నారు. ఇది పర్యావరణ అనుకూలమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించే డీకార్బనైజేషన్ లక్ష్యంలో భాగమని ఆయన తెలిపారు.

ఈ-మొబిలిటీ వైపు భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేయడమే ధ్యేయంగా BPCLతో  ఒప్పందం చేసుకున్నామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

One thought on “EVల కోసం టాటా మోటార్స్ 7,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. BPCLతో కీలక ఒప్పందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *