ఈవీ, Lithium ion batteries పరిశ్రమలకు శుభవార్త
తగ్గనున్న ఎలక్ట్రిక్‌వాహనాల ధరలు
ఇండియాలోని జమ్మూ కాశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు. దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది శుభవార్త అని పరిశ్రమ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి లిథయం బ్యాటరీల దిగుమతులు కొంతవరకు తగ్గిపోయే అవకాశముందని చెబుతున్నారు.
గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో కొత్తగా లిథియం నిక్షేపాలను కనుగొన్నారు. కాగా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (PHEVలు)లో లిథియం-అయాన్ బ్యాటరీలను ( Lithium ion batteries ) ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.
మన దేశం హాంకాంగ్, చైనా, ఇండోనేషియా నుంచి లిథియం ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా లిథియం-అయాన్ పరంగా, ఇది చాలా వరకు చైనా నుండి వస్తుంది, తర్వాత హాంకాంగ్, వియత్నాం ఉన్నాయి.
ఇతర దేశాలపై ఇటువంటి ఆధారపడటాన్ని తగ్గించడం కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) విభాగమైన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (AMD), కర్ణాటకలోని మాండ్య, యాద్గిర్ జిల్లాల్లో లిథియం కోసం అన్వేషణకొనసాగిస్తోంది. మాండ్య జిల్లాలోని మర్లగల్ల ప్రాంతంలో మొత్తం 1,600 టన్నుల లిథియం వనరులు ఉన్నట్లు అంచనా వేసినట్లు గత సంవత్సరం పేర్కొంది.
అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ప్రతి సంవత్సరం వార్షిక ఫీల్డ్ సీజన్ ప్రోగ్రామ్ (FSP) ప్రకారం ఖనిజ అన్వేషణను వివిధ దశలను చేపడుతుంది. ఇది FSP 2021-22 సమయంలో అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జమ్మూ & కాశ్మీర్‌లలో లిథియం, అనుబంధ ఖనిజాలపై ఐదు ప్రాజెక్టులను నిర్వహించింది.
ఫలితంగా, లిథియం, బంగారంతో సహా 51 ఖనిజ బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసినట్లు గనుల మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది.
ఈవీ పరిశ్రమ వర్గాల ప్రకారం, ప్రభుత్వం EV బ్యాటరీ తయారీ, గ్రీన్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో తాజా వార్త బూస్టింగ్‌ను ఇస్తోంది. GSI నివేదికతో Li-ion సెల్స్, బ్యాటరీలను స్థానికంగా ఉత్పత్తి చేసే ఆశలను బలోపేతం చేస్తోంది.
Saera Electric Auto Private Ltd మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ కపూర్, స్పందిస్తూ ఈ ఆవిష్కరణను “EV పరిశ్రమకు గేమ్ ఛేంజర్” అని పిలిచారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ దేశంలో లిథియం అధిక దిగుమతి ధరపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంని అన్నారు.
[…] గరిష్టంగా 2.7 KW శక్తిని అందించే BLDC హబ్ మోటార్‌తో అందించబడింది. స్కూటర్ […]
[…] గోయెంకా మాట్లాడుతూ, “భారతదేశం రాజస్థాన్, కశ్మీర్ (Jammu Kashmir )లో భారీగా లిథియం నిల్వలను […]