Okinawa extended warranty : ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి శుభవార్త.. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకినోవా తాజాగా తమ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలలో ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ (EWP)ని ప్రకటించింది. USAలోని న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయమైన Assurant వ్యాపార సేవల సంస్థ భాగస్వామ్యంతో ఈ కొత్త స్కీమ్‌ను ప్రకటించబడింది. నూతన వారంటీ పథకం కింద ట్రాక్షన్ మోటార్లు, కంట్రోలర్లు, DC-DC కన్వర్టర్లు, ఛార్జర్‌లు వంటి పవర్‌ట్రెయిన్ భాగాలు కవర్ చేయబడతాయి.
ఒకినావా వైరింగ్ హార్నెస్‌లు, ఫ్రేమ్ అసెంబ్లీపై వారంటీని అందించే మొదటి కంపెనీగా అవతరించింది. బహుళ ప్రయోజనాల ద్వారా విక్రయాల అనంతరం వినియోగదారులకు వీలైనన్ని సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు దాని నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేసేందుకు కంపెనీ నిర్ణయించుకుంది.
Okinawa extended warranty (రెండు సంవత్సరాల వరకు) కనీస ధర రూ.2,287 తో ప్రారంభమవుతుంది. వాహన మోడల్, రేంజ్‌ను బట్టి వివిధ స్లాబ్‌ల క్రింద 5,494. వరకు ఉండొచ్చు. కొత్త కస్టమర్‌లకు అలాగే గత మూడేళ్లలో ఒకినావా వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి ఈ పథకం చెల్లుబాటు అవుతుంది.
ఒకినావా తన 540 అధీకృత డీలర్ల నెట్‌వర్క్ ద్వారా ప్రోగ్రామ్‌ను అమలు చేస్తుంది. కాగా క్లెయిమ్ ఫైలింగ్ ప్రక్రియ వేగంగా, సరళంగా, అవాంతరాలు లేకుండా ఉంటుందని కంపెనీ చెబుతోంది. వినియోగదారులు తమ అవసరాలు, సౌలభ్యం ప్రకారం దీనిని పొందవచ్చు. ఆసక్తి ఉన్న కస్టమర్‌లు extended warranty ని పొందడానికి సమీపంలోని ఒకినావా డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు.