Home » రాజస్థాన్ లో భారీగా లిథియం నిక్షేపాలు

రాజస్థాన్ లో భారీగా లిథియం నిక్షేపాలు

lithium reserves in Rajasthan
Spread the love

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు బూస్టింగ్

lithium reserves in Rajasthan : రాజస్థాన్ ప్రభుత్వం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని దేగానా మునిసిపాలిటీ (Degana)  పరిధిలో భారీగా లిథియం నిల్వలను గుర్తించించింది.. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో కనుగొన్న 5.9 మిలియన్ టన్నుల కంటే ఈ నిల్వలు ఎక్కువ ఉన్నాయని జీఎస్ఐ తెలిపింది. రాజస్థాన్‌లో లభించే లిథియం పరిమాణం దేశ డిమాండ్ ను అవసరాలలో 80 శాతం తీర్చగలదని అధికారులు పేర్కొన్నారు. లిథియం ప్రపంచవ్యాప్తంగా తేలికైన మృదువైన లోహం. నాన్ ఫెర్రస్ మెటల్, ఇది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. EV బ్యాటరీలలో కీలకమైన భాగాలలో ఒకటి.

క్యాపిటల్ A వ్యవస్థాపకుడు & లీడ్ ఇన్వెస్టర్ అంకిత్ కేడియా మాట్లాడుతూ “ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం-అయాన్ బ్యాటరీలు అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన. తేలికైన బ్యాటరీ తయారీకి పయోగపడుతుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో లిథియం నిల్వలను కనుగొనడం శుభపరిణామం. భారతీయ EV పర్యావరణ వ్యవస్థకు బాగా సరిపోతుంది. లిథియం నిల్వలను కనుగొనడంతోనే సరిపోదు.. ఇంకా ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ తయారీ నైపుణ్యాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరముంది.. ఈ విషయంలో చైనా, యుఎస్ వంటి దేశాలు మనకంటే చాలా ముందున్నాయి.’  అని తెలిపారు.

భారతదేశంలో EV స్వీకరణ పెద్ద ఎత్తున ప్రారంభమైందని,  ప్రజలు ఇప్పుడిప్పుడే EVలను కొనుగోలు చేయడం కొనసాగించబోతున్నారని గమనించాలని అంకిత్ కేడియా తెలిపారు. ఇక్కడే భారతదేశం గొప్ప పురోగతి సాధించిందని, ఈ నేపథ్యంలో లిథియం నిల్వల గుర్తింపు ఎంతో కీలకమైన పరిణామమని చెప్పారు. lithium reserves in Rajasthan

చైనా ఆధిపత్యానికి చెక్ !

ఛార్జ్అప్ CEO, సహ వ్యవస్థాపకుడు వరుణ్ గోయెంకా మాట్లాడుతూ, “భారతదేశం రాజస్థాన్‌, కశ్మీర్ (Jammu Kashmir )లో భారీగా లిథియం నిల్వలను కనుగొన్నన్ననేపథ్యంలో, దేశం త్వరలో EVలలో 3వ అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుంది. ఈ విషయంలో చైనా ఆధిపత్యాన్ని అధిగమించొచ్చని పేర్కొన్నారు.  ” లిథియం నిల్వల ఆవిష్కరణతో, భారతదేశం ఇప్పుడు విదేశాలపై ఆధారపడడం తగ్గిపోతుంది. లిథియం ధరల హెచ్చుతగ్గుల నియంత్రించగలదు. ఈ పరిణామం భారతదేశం తన దేశీయ అవసరాలను తీర్చడానికి మాత్రమే కాకుండా ఇది ఇతర దేశాలకు లిథియం సరఫరా చేయడానికి వీలుంటుంది.  దేశం యొక్క EV పరిశ్రమకు మంచి భవిష్యత్తును సృష్టిస్తుంది. “అని అన్నారు.

ప్రస్తుతానికి, భారతదేశం నికెల్, కోబాల్ట్, లిథియం nickel cobalt) వంటి అనేక ఖనిజాల కోసం దిగుమతులపై ఆధారపడింది. ఈ కీలకమైన ఖనిజాల సరఫరాను బలోపేతం చేయాలని చూస్తోంది. ఇది ఎలక్ట్రికల్ వాహనాల వ్యవస్థను విస్తరించడానికి దాని ప్రణాళికలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి  దోహదపడుతుందని తెలిపారు.

ప్రస్తుతానికి, ప్రపంచంలోని లిథియం ఉత్పత్తిలో 47 శాతం ఆస్ట్రేలియాలో, 30 శాతం చిలీలో, 15 శాతం చైనాలో జరుగుతోంది. కానీ, ఖనిజ ప్రాసెసింగ్‌లో 58 శాతం చైనాలో, 29 చిలీలో,  అలాగే 10 శాతం అర్జెంటీనాలో జరుగుతున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *