Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Ather 450X Price Drop: ఏథ‌ర్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ త‌గ్గింపు

Spread the love

Ather 450X Price Drop : Ather Energy త‌న వేరియంట్ 450X ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించింది. త‌గ్గించిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా అందులో కొన్ని ఫీచ‌ర్ల‌ను కూడా తొల‌గించింది. అత్యాధునిక ఫీచ‌ర్లు కావ‌ల్సిన వారు ప్రో-ప్యాక్ 450X వేరింయంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటి ధరల‌ను ప‌రిశీలిస్తే 450X ధ‌ర రూ. 1,14,636, అలాగే 450X ప్రో ప్యాక్ ధ‌ర రూ. 1,45,000 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, FAME II, ఛార్జర్‌తో సహా)గా ఉంది.

ప్రో-ప్యాక్ లేని Ather 450X ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ TVS iQube (రూ. 1,12,230 ఆన్-రోడ్), మిడ్-స్పెక్ Ola S1 (రూ. 1,14,999 ఎక్స్-షోరూమ్) బేస్ వేరియంట్‌తో పోటీపడుతుంది. Ather 450X Price Drop

ప్రో-ప్యాక్ లేకుండా 450Xలో కొత్తగా ఏముంది?

మీరు ప్రో-ప్యాక్ లేకుండా 450X కొనుగోలు చేసినప్పటికీ, అందులో ప్రో ప్యాక్‌లో ఉన్న 450X హార్డ్‌వేర్‌ను పొందుతారు. ఇందులో అదే బ్యాటరీ, అదే మోటారు, మరీ ముఖ్యంగా అదే పనితీరు క‌న‌బ‌రుస్తుంది. ఆ విధంగా, Ather 450X యొక్క ప్రధాన లక్షణాలు రాజీ పడకుండా చూస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్, రైడ్ మోడ్‌లు, TFT టచ్‌స్క్రీన్, టైర్ ప్రెజర్ మానిటర్, గూగుల్ మ్యాప్స్, హిల్ అసిస్ట్, పార్క్ అసిస్ట్, ఐదేళ్ల బ్యాటరీ వారంటీ (ప్రో-ప్యాక్ లేకుండా మూడేళ్లు మాత్రమే) వంటి వాటిని మీరు కోల్పోతారు. క‌ల‌ర్ స్క్రీన్‌కు బదులుగా మీరు 7-అంగుళాల గ్రేస్కేల్ డిస్‌ప్లేను క‌లిగి ఉంటుంది.

Ola, TVS వంటి ఇతర బ్రాండ్‌లు కూడా iQube, S1 ప్రో వాహ‌నాలు తక్కువ-స్పెక్ వేరియంట్‌లను తయారు చేయడానికి కొన్ని ఫీచర్‌లను తీసివేసి, తక్కువ-సామర్థ్యం కలిగిన బ్యాటరీలు, మోటార్‌లను ఉపయోగించింది. కానీ Ather హార్డ్‌వేర్‌ను ఏమాత్రం మార్పు చేయ‌కుండా సాఫ్ట్‌వేర్, స్మార్ట్ ఫీచ‌ర్ల‌ను త‌గ్గించింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్, కనీసం ఒక రైడ్ మోడ్ వంటి ఫీచ‌ర్ల‌ను కొన‌సాగించి ఉంటే బాగుండేద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Tech News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *