ఈనెల 19న లాంచ్‌కు సన్నాహాలు
MG Comet EV launch : MG మోటార్ ఇండియా (MG Motor India ) ఏప్రిల్ 19న భారతదేశంలో MG కామెట్ EV (MG Comet EV) ని విడుదల చేయనుంది. అయితే, కంపెనీ భారతదేశంలోని తన ప్లాంట్ నుండి కారు మొదటి ఉత్పత్తి మోడల్‌ను విడుదల చేస్తున్నందున ఈ ఎలక్ట్రిక్ కారు కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మొదటి యూనిట్ గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్ నుండి విడుదల చేయబడింది. కొత్త EV ధర రూ.10లక్షల లోపు అవకాశం ఉంది.
MG Comet EV ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన GSEV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. మినీ కారు పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించబడింది. MG ప్లాట్‌ఫారమ్ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. వులింగ్ చైనా (Wuling ) లో ఇతర GSEV-ఆధారిత వాహనాలను విక్రయిస్తోంది. ఇది అత్యంత విజయవంతమైన మోడల్‌లలో ఒకటిగా నిలిచింది. MG మోటార్ ప్రకారం, కంపెనీ ఇప్పటివరకు 1 మిలియన్ యూనిట్లకు పైగా విక్రయించింది.
భద్రత పరంగా కామెట్ EV GSEV ప్లాట్‌ఫారమ్ దృఢమైన స్టీల్ ఫ్రేమ్, ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. MG కామెట్ EV వాహనం పటిష్టమైన బిల్ట్ క్వాలిటీ కోసం -ఇన్-వైట్ అంతటా 17 హాట్ స్టాంపింగ్ ప్యానెల్‌లతో వస్తుంది. MG Comet EV launch
MG Comet EV ఫీచర్లు
కామెట్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ (IoV), మల్టీమీడియా, కనెక్టివిటీ ఫీచర్లతో సహా వివిధ టెక్నికల్ స్పెసిఫికేషన్లతో వస్తుంది. రెండు భారీ స్క్రీన్‌లతో కూడిన వాహనం డ్యాష్‌బోర్డ్‌ను కంపెనీ ఇటీవల వెల్లడించింది. MG మోటార్ దీనిని ‘ఇంటిలిజెంట్ టెక్ డాష్‌బోర్డ్’గా పిలుస్తోంది.
కారు 10.25-అంగుళాల హెడ్ యూనిట్, 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ ఫ్లోటింగ్ వైడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్.. మూడు పూర్తిగా కస్టొమైజ్ పేజీలతో విభిన్న పరిమాణాల విడ్జెట్‌లను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు వినోదం, నావిగేషన్, కనెక్టివిటీ ఆప్షన్లకు అనుమతినిస్తుంది.
కంపెనీ ఏం చెబుతోంది?
కామెట్ మొదటి ప్రొడక్షన్ రోల్ అవుట్‌పై MG మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు బాలేంద్రన్ వ్యాఖ్యానిస్తూ.. “ఇటీవలి నీల్సన్ నిర్వహించిన అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ప్రకారం నిస్సందేహంగా కాంపాక్ట్ స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనం పట్టణ ప్రాంతాలకు సరిగ్గా సరిపోతుంది. MGలో తాము వినూత్నమైన, స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్‌లను అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. MG కామెట్‌తో అనేక ఫన్-టు-డ్రైవ్ ఎలిమెంట్‌లతో ఫ్యూచర్ అర్బన్ EVని అందిస్తామని పేర్కొన్నారు.