Thursday, December 26Lend a hand to save the Planet
Shadow

Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలు.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ..

Spread the love

Hero MotoCorp | దశాబ్దాలుగా సాంప్రదాయ పెట్రోల్ ద్విచక్రవాహనాల మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించిన హీరో మోటోకార్ప్, గత ఏడాది బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Vida v1 ను ప్రవేశపెట్టింది. పెట్రోల్ వాహనాల అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న హీరో మోటోకార్ప్ .. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో ఆ స్థాయిలో దూసుకువెళ్లడం లేదు.. ఈ విభాగంలోనూ దుసుుకుపోయేందుకు హీరోమోటో కార్ప్ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తాజాగా  కంపెనీ ఒక సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1 లక్ష లేదా అంతకంటే తక్కువ ధరతో విడుదల చేయనుంది, అలాగే   రెండవది రూ. 1.23-1 లక్షల ధరతో లాంచ్ చేస్తామని  హీరో మోటోకార్ప్ యాజమాన్యం ఈరోజు తెలిపింది.

ఈవీ మార్కెట్ లో ఇప్పటికే అనేక కంపెనీలు స్థిరపడ్డాయి.  రాబోయే మూడేళ్లలో ఈ సెగ్మెంట్‌లో గందరగోళం ఏర్పడుతుంది, ఎందుకంటే కేంద్రం ఇచ్చే సబ్సిడీలు కూడా శాశ్వతంగా కొనసాగించలేకపోవచ్చు” అని హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా విలేకరులతో అన్నారు.

ఓలా ఎలక్ట్రిక్, ఏథర్, ఇతరులు కంపెనీలు గత సంవత్సరం భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) మార్కెట్‌లో ఏకంగా  858,936 యూనిట్ల విక్రయాలు జరిపాయి.  హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ 11,139 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది  మార్కెట్ లో 1.29 శాతం మార్కెట్ వాటాను కూడగట్టుకుంది.

ప్రభుత్వ డేటా ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ 2023లో 266,867 యూనిట్లను (31 శాతం) విక్రయించింది. ఇది E2W స్పేస్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. TVS మోటార్ కంపెనీ 166,502 యూనిట్లతో తర్వాతి స్థానంలో ఉంది. 104,609 యూనిట్లను విక్రయించిన ఏథర్ ఎనర్జీ మూడవ స్థానంలో ఉండగా, బజాజ్ ఆటో 71,898 యూనిట్లతో, గ్రీవ్స్ కాటన్ యాజమాన్యంలోని ఆంపియర్ ఎలక్ట్రిక్ 42,891 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగాయి.

అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో పోటీ మారథాన్ లాంటిదని, 100 మీటర్ల పరుగు పందెం కాదని, ప్రారంభంలో ముందున్న వారు అరుదుగా విజేతలుగా నిలుస్తారని గుప్తా అన్నారు. “నేను మా పోటీ కంపెనీపై ఏమాత్రం చింతించను. వినియోగదారులకు  అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చూస్తున్నాం. స్టోర్‌లు, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివ’ద్ధి చేస్తున్నామని  చెప్పారు.

హీరో మోటోకార్ప్ వచ్చే ఏడాదిలో మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోందని ఆయన చెప్పారు – ఒకటి మిడ్-ప్రైస్ సెగ్మెంట్‌లో ఒకటి, ఎకానమీ విభాగంలో ఒకటి, అలాగే బి2బి లాస్ట్-మైల్ డెలివరీ సెగ్మెంట్‌లో ఒక వాహనాన్ని తీసుకొస్తామని తెలిపారు.

“EVలలో గేమ్ ఇప్పుడే ప్రారంభమైంది. కాబట్టి మేము ఏమాత్రం చింతించము. ఎన్ని ఎక్కువ కంపెనీలు ఉంటే అంత ఎక్కువ పోటీ, మరింత ఆవిష్కరణలు జరుగుతయి. ఇది దేశానికి కూడా మంచిదే ”అని గుప్తా తెలిపారు.  “మేము భారతదేశంలో మాత్రమే చూడకూడదు, భారతదేశం EVలను ప్రపంచానికి ఎలా విక్రయించగలదో కూడా మనం చూడాలి.” అని అన్నారు.

“హీరో మోటోకార్ప్ విస్తృత పంపిణీ నెట్‌వర్క్ కలిగి ఉన్నప్పటికీ, కంపెనీకి మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా ఉండటం కష్టం.  ఎందుకంటే వారి  మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా వీ1  మిగతా ‘స్కూటర్ల కంటే ఎక్కువ ధరను కలిగి ఉంది. మార్కెట్ లో పోటీ ధరల్లో సరైన స్కూటర్ ను తీసుకొస్తే  అది మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే చాన్స్ ఉంటుంది.

ఇదిలా ఉండగా Hero MotoCorp .. కాలిఫోర్నియాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్‌ సహకారంతో రూ. 4-7 లక్షల రేంజ్ లో  ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లపై కూడా పని చేస్తోంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *