MG Motor India : MG మోటార్ ఇండియా వావ్ ఆఫర్‌తో 100 సంవత్సరాల వేడుకలను జరుపుకుంది. కార్ల కొనుగోలుదారులను ఆహ్లాదపరిచడంపై దృష్టి సారించింది. దాని 2024 శ్రేణి మోడళ్లకు వావ్ ధరలను పరిచయం చేస్తోంది. ఎంజీ మోటార్స్ ప్రస్తుతం MG ZS EV, MG Comet EV , MG Hector, MG Gloster వంటి వాహనాలను విక్రయిస్తోంది. ఇటీవలే MG ZS EV ఎగ్జిక్యూటివ్ అనే కొత్త ట్రిమ్‌ను కూడా పరిచయం చేసింది.
ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంపొందించడానికి ZS EV ఎగ్జిక్యూటివ్ MG కంపెనీ EV పోర్ట్‌ఫోలియోను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకొచ్చింది. రూ.18.98 లక్షల ధరతో, ZS EV ఎగ్జిక్యూటివ్ EVలను వేగంగా స్వీకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. MG హెక్టర్స్ వావ్ ధరలు పెట్రోల్ వేరియంట్‌కు రూ. 14.94 లక్షలు, డీజిల్ వేరియంట్‌కు రూ. 17.50 లక్షల నుండి ప్రారంభమవుతాయి.
ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ, ZS EV ‘ఎగ్జిక్యూటివ్ కంపెనీ యొక్క EV పోర్ట్‌ఫోలియోను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, EVలను వేగంగా స్వీకరించడానికి ప్రోత్సహించడానికి పరిచయం చేసింది. విశాలమైన ZS EV ఎగ్జిక్యూటివ్ INR 18.98 లక్షల ధరలో అందుబాటులో ఉంది *. MG ZS EV 75 కంటే ఎక్కువ ఫీచర్‌లతో పవర్-ప్యాక్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అనుభవాన్ని అందిస్తుంది. అతిపెద్ద ఇన్-సెగ్మెంట్ 50.3kWh ప్రిస్మాటిక్ సెల్ IP69K రేటెడ్ ASIL-D & UL2580 బ్యాటరీ, ఒకే ఛార్జ్‌లో 461km** సర్టిఫైడ్ రేంజ్ ఇస్తుంది.
పట్టణ వినియోగదారుల కోసం MG Comet EV
భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయాలనే కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ స్పృహతో కూడిన పట్టణ వినియోగదారుల కోసం MG కామెట్ EVని ప్రారంభించింది. MG కామెట్ EV ని రూ.లక్ష తగ్గింపుతో ఇప్పుడు రూ. 6.99 లక్షలతో ప్రారంభమవుతుంది. సౌలభ్యం, లగ్జరీ, ఆధునిక సాంకేతికతకు ప్రసిద్ధి చెందిన MG గ్లోస్టర్ ప్రారంభ ధర రూ. 37.49 లక్షలు నుంచి ఉంటుంది. .
MG Motor India డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, “MGలో, మా కార్యకలాపాలలో కస్టమర్ల మనసు చూరగొనేందుకు చర్యలు తీసుకుంటున్నాము. మా శతాబ్ది ఉత్సవాలకు కొనసాగింపుగా, 2024ని ఫాస్ట్ ఫార్వర్డ్ సంవత్సరంగా పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. లోకల్ మేయిడ్, దీర్ఘకాలిక సరుకు రవాణా ఒప్పందాలు, లాజిస్టిక్స్, సరఫరా చైన్ మెరుగుదల, మెరుగైన సర్వీస్ అందించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు.
MG మోటార్ ఇండియా గురించి..
మోరిస్ గ్యారేజెస్ మోటార్స్ ను 1924లో UKలో స్థాపించారు. ఈ కంపెనీ స్పోర్ట్స్ కార్లు, రోడ్‌స్టర్‌లు క్యాబ్రియోలెట్ సిరీస్‌లకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. MG వాహనాలు బ్రిటీష్ ప్రధానమంత్రులు, బ్రిటీష్ రాజకుటుంబంతో సహా అనేక మంది ప్రముఖులు వినియోగించారు. స్టైలింగ్, చక్కదనం , ఆకట్టుకునే పనితీరుతో అందరిలో క్రేజ్ సంపాదించుకుంది. UKలోని అబింగ్‌డన్‌లో 1930లో స్థాపించబడిన MG కార్ క్లబ్, వేలాది మంది నమ్మకమైన అభిమానులను కలిగి ఉంది, ఇది కార్ బ్రాండ్ కోసం ప్రపంచంలోని అతిపెద్ద క్లబ్‌లలో ఒకటిగా నిలిచింది. MG గత 100 సంవత్సరాలలో వినూత్న బ్రాండ్‌గా అభివృద్ధి చెందింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
[…] EV సమీప ప్రత్యర్థి అయిన MG Comet EV ధర కూడా ఇటీవలే రూ. 1.40 లక్షల వరకు […]