Hero Vida V1 e-scooter : మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేద్దామని అనుకుంటున్నారా? అయితే.. ఇదే మీకు సరైన సమయం.. 2023 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవచ్చు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన హీరో విడా వి1 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ డిస్కౌంట్ తో ఇప్పుడు అందుబాటులో ఉంది.
Hero vida v1 offers: ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తీసుకొచ్చిన ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ విడా V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది. 2023 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్, విడా.. విడా V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సంవత్సరాంతపు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో ముందస్తు డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీ, తక్కువ వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజులు, రూ. 2,429తో ప్రారంభమయ్యే ఈఎంఐలు వంటివి ఉన్నాయి.
విడా ఫైనాన్సింగ్ కోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో భాగస్వామ్యం కలిగి ఉంది. విడా V1 ప్లస్ ఈవీ స్కూటర్ లో 3.44kWh బ్యాటరీని అమర్చారు.. విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే. 143కి.మీ రేంజ్ అందిస్తుంది. నవంబర్‌లో 57శాతం వృద్ధి తో హీరో విడా భారీ సంఖ్యలో విక్రయిస్తోంది.
విడా వి1పై రూ. 31వేల వరకు తగ్గింపు :
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ. 31వేల వరకు భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ మొత్తంలో మోడల్ స్టిక్కర్ ధరపై రూ. 6,500 ఇంస్టాంట్ డిస్కౌంట్., రూ. 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 7,500 లాయల్టీ బోనస్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ కంపెనీ రూ. 2,500 కార్పొరేట్ తగ్గింపు, రూ. 1,125 విలువైన కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.. రూ. 8,259 విలువైన ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీని కూడా అందిస్తోంది.
సులభ వాయిదాలతో..
ఫైనాన్సింగ్ కోరుకునే కస్టమర్లకు 5.99శాతంతో తక్కువ వడ్డీ రేట్లు, లోన్‌లపై జీరో ప్రాసెసింగ్ ఫీజులు, రూ. 2,429 నుంచి ఈఎంఐ వంటి ఫైనాన్స్ ఆప్షన్ల అందుబాటులో ఇన్నాయి.. విడా వి1 ఈవీ స్కూటర్ హీరో ఫైనాన్స్ కార్పొరేషన్, ఐడీఎఫ్‌సీ, ఈకోఫై వంటి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో భాగస్వామ్యం కలిగి ఉంది..
వి1 ఈ-స్కూటర్ టాప్ స్పీడ్, ధర ?
Hero vida v1 offers విడా వి1 ప్లస్ 3.44 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీని వియోగించారు. దీని ద్వారా సింగిల్ ఛార్జ్ పై 143కి.మీ రేంజ్. అందిస్తుంది. మరో బ్యాటరీ వెరియంట్ ను చూస్తే.. వి1 ప్రోలో పెద్ద 3.94kWh బ్యాటరీ కలిగి ఉంది.. ఇది 165కి.మీల క్లెయిమ్ పరిధిని అందిస్తుంది. ఈ రెండు వేరియంట్‌లు ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో వస్తాయి. 6కెడబ్ల్యూ పీక్ పవర్, వి1 ఈ-స్కూటర్‌ను గరిష్ట స్పీడ్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి.
కంపెనీ గురించి..
భారత దేశంలో ద్విచక్ర వాహన రంగంలో లెగసీ బ్రాండ్ అయిన హీరో.. తన విడా మోడల్ అమ్మకాలతో తిరిగి పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఆకట్టుకునే అమ్మకాలను సాధించింది.. ఈ ఏడాది నవంబర్‌లో విడా మోడల్ 3,030 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 1,935 యూనిట్లతో పోలిస్తే.. 57 శాతం వృద్ధిని నమోదు చేయడం జరిగింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.
Hero Veda 1 price
Good job
Nice