Honda Activa EV | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా (Honda) ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగులు వేస్తోంది. అతిత్వరలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ను బట్టి తెలుస్తోంది. హోండా యాక్టివా ఈవీ టీజర్ ఇదిగో..!
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ యాక్టివాను విద్యుత్ స్కూటర్ రూపం (Activa EV) లో తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కంపెనీ విడుదల చేసిన టీజర్‌ను పరిశీలిస్తే అందులో యాక్టివా మాదిరిగానే స్పష్టంగా కనిపిస్తున్నది. లుక్స్ పరంగా పెద్దగా మార్పులేవీ లేకుండానే ఎలక్ట్రిక్ అవతార్ లో తీసుకొచ్చే చాన్స్ కనిపిస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్, ఏథర్, గ్రీవ్ ఆంపియర్ వంటి స్టార్టప్ లు దేశీయ ఈవీ మార్కెట్లో చాలా పాపులర్ అయ్యాయి. మరోవైపు బజాజ్, టీవీఎస్, హీరో మోటోకార్ప్ వంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే బజాజ్ చేతక్, టివిఎస్ ఐక్యూబ్ మోడళ్లతో విక్రయాలు భారీగా పెంచుకొని మొదటి రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. కాస్త ఆలస్యంగానైనా దేశీయ అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ విడా పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చసింది. ఈ క్రమంలో హోండా నుంచి కూడా త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురాబోతోందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ కంపెనీ నుంచి తాజా టీజర్ వచ్చింది. త్వరలోనే ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. హోండా యాక్టీవా (Honda Activa) ఎంట్రీతో విద్యుత్ విపణిలో పోటీ మరింత తీవ్రతరమవుతుంది. కొత్త యాక్టీవా ఈవీ ధర, ఫీచర్లు, రేంజ్ ఎంత ఉండనుందనే వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Honda Activa Electric Scooter!#Honda #Activa #EV pic.twitter.com/4C2Ns7tjhV
— Vande bhaarath (@harithamithra1) November 12, 2024
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..