Green Power Generation : తెలంగాణలో 20 గిగావాట్ల (20GW) గ్రీన్ పవర్ ఉత్పత్తి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క వెల్లడించారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 2030 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబరు 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో విద్యుత్ పొదుపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పునరుత్పత్తి విద్యుత్ అభివృద్ధి సంస్థ (TGREDCO) రూపొందించిన క్యాలెండర్‌ను ఉపముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2030 నాటికి 20GW పునరుత్పత్తి విద్యుత్, 2035 నాటికి 40GW విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించిందని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలతో విద్యుత్ పునరుత్పాదకం, పొదుపు లక్ష్య సాధన కోసం సాంకేతికపరంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంగా TGREDCO చేపట్టిన కార్యక్రమాలను డిప్యూటీ సీఎం విక్రమార్కకు వీసీ అండ్ ఎండీ వావిల్ల అనిల వివరించారు. విద్యుత్ పొదుపు, నాణ్యత, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE)తో తదితర అంశాలపై TGREDCO ప్రత్యేక దృష్టి పెట్టిందని, విజయవంతంగా దీనిని అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ రెడ్కో జనరల్ మేనేజర్ జి.ఎస్.వి.ప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటరమణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధిక తదితరులు పాల్గొన్నారు
అచీవ్‌మెంట్లు ఇవీ…
టీజీ రెడ్‌కో ఇప్పటి వరకు సాధించిన విజయాలు, చేరాల్సిన లక్ష్యాల గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వీసీ అండ్ ఎండీ అనిల అంశాల వారీగా వివరించారు. అవేమిటంటే…
- ఎనర్జీ కన్వేర్షన్ బిల్డింగ్ కోడ్ (ECBC) : ఎనర్జీ కన్వేర్షన్ బిల్డింగ్ కోడ్ అమలులో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ECBC అనుగుణంగా 879 కమర్షియల్ భవనాలు మార్పు చెందడంతో 392.21 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోంది.
- కూల్ రూఫ్ పాలసీ: తెలంగాణలో కూల్ రూఫ్ పాలసీ (2023-28) అమల్లో ఉంది. ఇది దేశంలోనే మొట్టమొదటిది. వేసవిలో తాపాన్ని ఇది తగ్గిస్తుంది. పవర్ వినియోగాన్ని తగ్గిస్తుంది.
ప్లాట్‌ఫాం అచీవ్ అండ్ ట్రేడ్ ( PAT ) కార్యక్రమం : రాష్ట్రంలోని 43 పరిశ్రమలు PAT డిజిగ్నేటెడ్ కన్జూమర్స్ (DCs) గా గుర్తింపు పొందాయి. మొదటి రెండు PAT సైకిల్స్‌లో 0.24 మిలియన్ టన్నుల ఆయిల్‌కు సమానమైన విద్యుత్ ఆదా అయ్యింది.
డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ (DSM): తెలంగాణలో డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాం. దీని ద్వారా హైదరాబాద్ నగరం మొత్తం 40MW విద్యుత్‌ను ఆదా చేయగలిగాం. రాష్ట్రంలోని 73 పట్టణాలు, గ్రామపంచాయతీల్లో 17.23 లక్షల స్ట్రీట్‌లైట్లను LEDలోకి మార్చాం.
20W LED ట్యూబ్ లైట్లు, 32 లక్షల LED బల్బులు, 28W BLDC ఫ్యాన్లు సరసమైన ధరలో పంపిణీ చేయడంతో 439 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యింది. విద్యుత్ పొదుపుపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు 168 ఎనర్జీ క్లబ్బులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ సంస్థల్లో 57,483 పాత పరికరాలను LEDలోకి మార్చడం వల్లల 2.87 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యింది.
పురస్కారాలు:
- విద్యుత్ ఆదా, సంక్షరణ కార్యక్రమాల్లో సమర్థంగా పని చేసిన వారికి తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ (TSECA)ను ప్రదానం చేసి గౌరవిస్తున్నాం.
- తెలంగాణ రాష్ట్రం మూడు జాతీయ విద్యుత్ పొదుపు అవార్డులు (NECA) అందుకుంది.
- విద్యుత్ పొదుపు వారోత్సవాల సందర్భంగా విస్తృత ప్రచారం చేస్తున్నాం. ర్యాలీలు, డిబేట్లు నిర్వహించనున్నాం.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..