Monday, July 7Lend a hand to save the Planet
Shadow

Tag: renewable energy

Tata Power | ఏపీలో టాటా ప‌వ‌ర్‌ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు

Tata Power | ఏపీలో టాటా ప‌వ‌ర్‌ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు

Solar Energy
టాటా రెన్యువబుల్ ఎనర్జీ (Tata Power Renewable Energy (TPREL)) తో ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ఎన‌ర్జీ రంగంలో టాటా సంస్థ‌ రూ.49వేల కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంది. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో వచ్చే ఐదు సంవ‌త్స‌రాల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాల‌ని ప్రభుత్వం పెట్టుకుంది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి దిశ‌గా కీలక ముందడుగు పడిందని రాష్ట్ర‌ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 7వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం టాటా పవర్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఆయ‌న వెల్ల‌డించారు. దీని ద్వారా 7.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సైతం కొత్త బ‌లం వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన టాటా సంస్థకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్రప్...
Renewable Energy : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ

Renewable Energy : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ

Solar Energy
Clean and Green Energy Policy | హైదరాబాద్ : రానున్న పదేళ్లలో తెలంగాణ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ (Telangana Renewable Energy)ని ప్రకటించాలని రాష్ట్ర‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం దీనిపై ప్రకటన చేయనున్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కాబట్టి, 2023-24లో 85,644 MUల నుంచి 2027-28 నాటికి 1,15,347 MUలకు, 2034-35 నాటికి 1,50,040 MUలకు విద్యుత్ అవసరం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. విద్యుత్ డిమాండ్ 2023-24లో 15,623 మెగావాట్ల (MW) నుంచి 2034-35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.2030 నాటికి 2000 మెగావాట్ల పునరుత్పాద‌క విద్యుత్‌పెరుగ...
Green Power Generation | తెలంగాణ‌కు 20 గిగావాట్ల గ్రీన్ పవర్‌

Green Power Generation | తెలంగాణ‌కు 20 గిగావాట్ల గ్రీన్ పవర్‌

General News
Green Power Generation : తెలంగాణలో 20 గిగావాట్ల (20GW) గ్రీన్ ప‌వ‌ర్ ఉత్ప‌త్తి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి మ‌ల్లు విక్ర‌మార్క వెల్లడించారు. పున‌రుత్పాద‌క విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 2030 నాటికి ఈ ల‌క్ష్యాన్ని చేరుకుంటామ‌ని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబ‌రు 14 నుంచి 20 వ‌ర‌కు జాతీయ ఇంధ‌న పొదుపు వారోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ‌లో విద్యుత్ పొదుపు వేడుకల‌ను ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర పునరుత్పత్తి విద్యుత్ అభివృద్ధి సంస్థ (TGREDCO) రూపొందించిన క్యాలెండ‌ర్‌ను ఉపముఖ్యమంత్రి ఆవిష్క‌రించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2030 నాటికి 20GW పునరుత్పత్తి విద్యుత్, 2035 నాటికి 40GW విద్యుత్‌ ఉత్పత్తికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించింద‌ని తెలి...
Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Solar Energy
Renewable Energy : గుజరాత్‌ రాజధాని గాంధీనగర్ లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సు (RE Invest 2024 ) లో పలు రాష్ట్రాలు భాగస్వాముల‌య్యాయ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ (Pralhad Joshi) తెలిపారు. 2030 నాటికి రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. సంప్ర‌దాయ‌ విద్యుత్‌ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌ణాళికా బ‌ద్దంగా ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. ఈ సదస్సులో నాలుగు దేశాలు హాజరయ్యాయని వెల్ల‌డించారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మంగళవారం గాంధీనగర్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు.పునరుత్పాదక ఇంధన రంగం (Renewable Energy) లో భారత్‌ ప్రపంచానికి రోల్‌మాడ‌ల్‌గా నిల‌వ‌నుంద‌ని మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం సుమారు 208 గిగావాట్‌ పునరుత్పాదక ఇంధనాన్ని మ‌న‌దేశం ఉత్పత్తి చేస...
Solar Power Project | అసోంలో 25 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన

Solar Power Project | అసోంలో 25 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన

Solar Energy
Solar Power Project : రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించే దిశగా అస్సాం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈమేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Assam Chief Minister Himanta Biswa Sarma)  దిబ్రూగఢ్ జిల్లాలోని నామ్‌రూప్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో 25-మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అస్సాం పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్ గా, ఈ ప్రాజెక్ట్ 108 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీని వ్యయం రూ. 115 కోట్లు.ఆగస్టు 19, 2022న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఈ ప్రాజెక్ట్ ఏటా 50 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేశారు. దీని నిర్మాణం జూలై 2025 నాటికి పూర్తవుతుంది. నామ్‌రూప్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ 2021లో తాను పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు...
Biofuel | బ‌యో ఫ్యూయ‌ల్.. భవిష్యత్ లో మానవ మనుగడకు ఇదే తప్పనిసరి..

Biofuel | బ‌యో ఫ్యూయ‌ల్.. భవిష్యత్ లో మానవ మనుగడకు ఇదే తప్పనిసరి..

Green Mobility
What is Biofuel? | బ‌యో ఫ్యూయ‌ల్.. బయోమాస్ లేదా మొక్కలు, జంతువుల వ్యర్థాల వంటి సేంద్రీయ పదార్థాల నుంచి త‌యారవుతుంది. శిలాజ ఇంధనాలు ఏర్ప‌డ‌డానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది కానీ ఈ బ‌యో ఫ్యూయ‌ల్ పునరుత్పాదక వనరుల నుంచి త్వరగా ఉత్పత్తి చేయవచ్చు. ప్రత్యామ్నాయ లేదా పునరుత్పాదక ఇంధనాలు అని కూడా పిలిచే ఈ జీవ ఇంధనాలు, సంప్రదాయ పెట్రోలియం ఇంధనాల కంటే ఎంతో స్వ‌చ్ఛ‌మైన‌వి.. ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో అనుకూల‌మైన‌వి. కార్ ఇంజిన్‌లో జీవ ఇంధనాలు ఎలా పని చేస్తాయి how biofuel works : జీవ ఇంధనాలు పూర్తిగా చమురుపై ఆధారపడకుండా మన కార్లకు ఇంధనాన్ని అందిస్తాయి. ప్ర‌స్తుతం ఇథనాల్ జనాదరణ పొందింది. ఇది మొక్కజొన్న వంటి మొక్కల నుండి వస్తుంది. వారు దానిని E10 లేదా E15 చేయడానికి గ్యాసోలిన్‌లో క‌లుపుతారు. మీ ఇంజిన్ మండించేటప్పుడు సాధారణ గ్యాస్ లాగా చాలా మండుతుంది. బయోడీజిల్ కూడా అదే పని చేస్తుంది. ఇది శాకాహార నూనెలు లేద...
క‌నీసం దోమ కూడా క‌నిపించ‌ని బంజ‌రు భూమిలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ పార్క్.. దీని విశేషాలు ఏమిటో తెలుసా.. ?

క‌నీసం దోమ కూడా క‌నిపించ‌ని బంజ‌రు భూమిలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ పార్క్.. దీని విశేషాలు ఏమిటో తెలుసా.. ?

Solar Energy
పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న మారుమూల ప్రాంతంలో, మల్టీ - బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఖవ్దా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కు (largest renewable energy park) ను నిర్మించింది. ఇది సౌరశక్తి నుండి ఏకంగా 45 GW సామర్థ్యం గ‌ల విద్యుత్ ను ఉత్ప‌త్తి చేస్తుంది. క‌నీసం చిన్న మొక్క కూడా పెర‌గ‌ని బంజ‌రు భూమి 2022 డిసెంబ‌ర్ లో గౌతమ్ అదానీ దృష్టిని ఆకర్షించింది. ఈ గ్రామానికి క‌నీసం పిన్‌కోడ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోయినా విశాలమైన బంజరు భూమిని అదానీ అద్భుతంగా వినియోగంలోకి తీసుకొచ్చారు.మొద‌ట్లో ఈ ప్రాంత‌మంతా బంజరు భూమిగా ఉంది, అధిక లవణీయత కారణంగా ఇక్క‌డ ప‌చ్చ‌దం లేదు. క‌నీసం మాన‌వ నివాసాలు కూడా క‌నిపించ‌వు. ఏది ఏమైనప్పటికీ, లడఖ్ తర్వాత దేశంలో రెండవ అత్యుత్తమ సౌర కిర‌ణాలు ప‌డే ప్రాంతంగా దీన్ని గుర్తించారు. మైదానాల కంటే ఐదు రెట్లు గాలి వేగాన్ని కలిగి ఉంది. ఇది పునరుత్ప...
Wave Energy | పర్యావరణ కాలుష్యం లేని సముద్ర అలలతో విద్యుత్ శక్తి.. ఈ వేవ్ ఎనర్జీతో ప్రయోజనాలు ఎన్నో..

Wave Energy | పర్యావరణ కాలుష్యం లేని సముద్ర అలలతో విద్యుత్ శక్తి.. ఈ వేవ్ ఎనర్జీతో ప్రయోజనాలు ఎన్నో..

General News
Wave Energy | రోజురోజుకు పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా విద్యుత్ శ‌క్తికి డిమాండ్ పెరుగుతూ వ‌స్తోంది. అయితే బొగ్గు ఆధారిత‌ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ తో క‌లిగే ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తులను అధిగ‌మించేందుకు ప్ర‌త్యామ‌న్నాయ శక్తివ‌న‌రుల‌ను అన్వేషించడం అత్యవసరం. ప్ర‌స్తుత కాలంలో జ‌ల విద్యుత్‌, సోలార్ ప‌వ‌ర్‌, ప‌వ‌న శ‌క్తితోపాటు సముద్రపు అలల నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే విధానం కూడా అందుబాటులోకి వ‌చ్చింది. మహాసముద్రాలు భూగోళంలో 70% ఆక్రమించాయి కాబట్టి ఇది ఆశాజనకమైన ఎంపికగా మారింది. అయితే ఈ క‌థ‌నంలో వేవ్ ఎన‌ర్జీ గురించిన పూర్తి వివ‌రాలను తెలుసుకోవ‌చ్చు.ఇది శిలాజ ఇంధనాల వంటి సాంప్రదాయ వనరులకు ప్రత్యామ్నాయంగా వేవ్ ఎనర్జీని ఉత్ప‌త్తి చేస్తున్నారు. ఈ శక్తి.. వేవ్ ఎనర్జీ కన్వర్టర్ల ద్వారా విద్యుత్ శక్తిగా మారుతుంది. తరంగ శక్తి వనరుల యొక్క లాభాలు మరియు నష్టాలను పరిశీలిద్దాం. వేవ్ ఎనర్జీ యొక్క ప్రయోజనాలుAdv...
Wind energy | 126 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ ప్రారంభం

Wind energy | 126 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ ప్రారంభం

General News
Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లోని తన 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులో అదనంగా 126 మెగావాట్ల ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇది కంపెనీకి సంబంధించి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) అనుబంధ సంస్థ అయిన అదానీ విండ్ ఎనర్జీ కచ్ ఫోర్ లిమిటెడ్ (AWEK4L), గుజరాత్‌లో 126 మెగావాట్ల విండ్ ప‌వ‌ర్ ను విజయవంతంగా అమలు చేసింది . గతంలో 174 మెగావాట్లతో కలిపి , ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పర్యావరణ ప్రభావం: ఈ ప్రాజెక్ట్ ఏటా 1,091 మిలియన్ల విద్యుత్ యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని, పునరుత్పాదక ఇంధన రంగానికి గణనీయంగా దోహదపడుతుందని అంచనా . ఇది సంవత్సరానికి సుమారుగా 0.8 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాల తగ్గించ‌డంలో దోహ‌ద ప‌డుతుంది. Adani Green Energy AGEL  భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పోర్ట్‌...
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates