Home » Hero Vida V2 Lite | హీరో విడా లైట్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లలో ఏది బెస్ట్..
Hero Vida V1 Plus vs competition

Hero Vida V2 Lite | హీరో విడా లైట్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లలో ఏది బెస్ట్..

Spread the love

Hero Vida V2 Lite | మధ్యతరగతి వినియోగదారుల కోసం హీరోమోటో కార్ప్ ఇటీవలే విడా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు హీరోమోటోకార్ప్ లో విడా లైట్ తోపాటు ప్లస్, ప్రో మోడల్‌లను కలిగి ఉంది. ఈ మూడు స్కూటర్‌లు ఓలా, ఏథర్, బజాజ్, టీవీఎస్‌ల ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోటీపడుతున్నాయి. ఈ విభాగంలో, విడాతో TVS iQube గట్టి పోటీనిస్తోంది. ఇది ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉన్న ఎంట్రీ-లెవల్ iQube Hero Vida V2 Lite తో పోటీపడుతుంది. ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌ల పరంగా అవి ఒకదానితో ఒకటి ఎలా ఉంటాయో ఒకసారి చూడండి..

కొత్త Vida V2 Lite దాని ఇదివరకు వచ్చిన విడా వి1 మాదిరిగాను ఉంటుంది. అయితే, ఇది ఇప్పుడు తక్కు ధరకు అందుబాటులోకి వచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర- రూ. 96,000. ఈ స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్, ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ బ్రేక్, LED హెడ్‌ల్యాంప్‌లు, కీలెస్ ఎంట్రీ, 26-లీటర్ బూట్ స్పేస్, నావిగేషన్ మరియు మొబైల్‌ కనెక్టివిటీతో కూడిన 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ ఉన్నాయి. ధర విషయానికొస్తే, Vida V2 Lite స్మార్ట్ ఫీచర్‌లతో బాగా ప్యాక్ చేసినట్లు కనిపిస్తోంది.

READ MORE  Ather Rizta Best Deal | ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ పై ఆకర్షణీయమైన డీల్స్..

89,999 (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన TVS iQube ఒకరి దృష్టిని ఆకర్షిస్తోంది.TVS iQube ఇదే విధమైన ఫ్రంట్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది, అయితే ఇది డ్యూయల్ రియర్ షాక్‌లను కలిగి ఉంటుంది. iQube ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్, 30-లీటర్ల స్టోరేజ్, ఫోన్ కనెక్టివిటీతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, LED లైటింగ్ ఫీచర్లు కలిగి ఉంటుంది. రెండింటిని పోల్చినప్పుడు, TVS iQube ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ ను కలిగి ఉంది ఇతర అంశాలు దాదాపు సమానంగానే ఉన్నాయి.

READ MORE  TVS iQube best deal : టీవీఎస్ ఐక్యూబ్ ఈవీపై 100% క్యాష్‌బ్యాక్, ఎక్స్‌టెండెడ్‌ వారంటీ మరెన్నో ఆఫర్లు..
స్పెసిఫికేషన్లువిడా V2 లైట్TVS iQube
బ్యాటరీ ప్యాక్2.2kWh2.2kWh
రేంజ్94 కి.మి (IDC)75 కి.మీ (Real World)
యాక్సిలరేషన్ (0-40)4.2 సెకన్లు4.2 సెకన్లు
టాప్ స్పీడ్గంటకు 69 కి.మీ75 కి.మి

Hero Vida V2 Lite మరియు TVS iQube రెండూ 2.2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, వాటి మధ్య ఒక పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, V2 లైట్ రిమూవల్ బ్యాటరీని కలిగి ఉంది. అయితే iQube ఫిక్స్ డ్ బ్యాటరీని పొందుతుంది. Hero Vida V2 Lite 94km IDC రేంజ్ ను ఇస్తుంది. అయితే iQube ఎలక్ట్రిక్ స్కూటఱ్ 75km రేంజ్ఇస్తుంది.

READ MORE  Ather Rizta Best Deal | ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ పై ఆకర్షణీయమైన డీల్స్..

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top