Home » TVS iQube best deal : టీవీఎస్ ఐక్యూబ్ ఈవీపై 100% క్యాష్‌బ్యాక్, ఎక్స్‌టెండెడ్‌ వారంటీ మరెన్నో ఆఫర్లు..
Flipkart Year End Sale

TVS iQube best deal : టీవీఎస్ ఐక్యూబ్ ఈవీపై 100% క్యాష్‌బ్యాక్, ఎక్స్‌టెండెడ్‌ వారంటీ మరెన్నో ఆఫర్లు..

Spread the love

TVS iQube best deal : TVS మోటార్ తన మిడ్‌నైట్ కార్నివాల్ ఇయర్-ఎండ్ సేల్‌ను ఆవిష్కరించింది. టీవీఎస్ ఐక్యూప్ ఈవీపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, ఉచిత వారంటీ, 100 శాతం రీఫండ్‌తో సహా మ‌రెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మిడ్‌నైట్ కార్నివాల్ డిస్కౌంట్‌లు డిసెంబర్ 22, 2024 వరకు అందుబాటులో ఉన్నాయి. TVS iQube Electric Scooter ధర రూ. 95,000 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఈ పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌ను కొనుగోలు ఉపయోగించాలనుకునే వారికి ఇది ఎంతో ఆకర్షణీయమైన డీల్ అని చెప్ప‌వ‌చ్చు..

TVS iQube Midnight Carnival : డీల్స్ ఏమిటి?

TVS iQube best deal Details : మిడ్‌నైట్ కార్నివాల్ ఒక ల‌క్కీ కస్టమర్‌కు 100 శాతం క్యాష్‌బ్యాక్ డీల్‌ను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. వినియోగదారులు TVS అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ల ద్వారా iQubeని బుక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని టీవీఎస్ ప్రకటించింది. TVS మోటార్ రూ. 30,000 వరకు సేవింగ్స్‌, 5 సంవత్సరాలు లేదా 70,000 కి.మీల వరకు ఉచిత ఎక్స్‌టెండెడ్‌ వారంటీ, టోస్టర్, బ్యాక్‌ప్యాక్, స్మార్ట్‌వాచ్, పవర్ బ్యాంక్, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల తోపాటు మరిన్ని వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

READ MORE  Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్

TVS iQube మిడ్‌నైట్ కార్నివాల్: స్పెసిఫికేషన్‌లు

టివిఎస్‌ iQube శ్రేణి మూడు బ్యాటరీ ఆప్ష‌న్స్‌తో వ‌స్తుంది. అవి 2.2 kWh, 3.4 kWh మరియు 5.1 kWh. ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5.9 బిహెచ్‌పి, 33 ఎన్ఎమ్ టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. సింగిల్ చార్జిపై 75 కిమీ రేంజ్ ఇస్తుంది. 2 గంటల 45 నిమిషాలలో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. మిడ్‌రేంజ్ 3.4 kWh వెర్షన్ అదే అవుట్‌పుట్, 100 కిమీ పరిధి, 3 గంటల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక‌ 5.1 kWh మోడల్ 150 కిమీ పరిధిని కలిగి ఉంది.ఇది 4 గంటల 18 నిమిషాలలో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

READ MORE  హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

READ MORE  హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..