- పంట రోగ ముందస్తుగా నిర్ధారణ
- తక్కువ కూలీ ఖర్చులు
రైతులకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ ‘కృషివాస్’ సంస్థతో కలిసి ఏఐ ఆధారిత శాటిలైట్ టెక్నాలజీ (AI in Agriculture) ని వినియోగించేందుకు ముందడుగు వేసింది. ఈ టెక్నాలజీతో రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ (Krishivas App) ద్వారా తమ పంటల్లో తెగుళ్ళను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చు.
కృషివాస్ సంస్థ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ తయారు చేసిన ఏఐ టెక్నాలజీతో శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ముందస్తుగానే పంటలకు వ్యాపించే చీడ పురుగులు, రసం పీల్చే పురుగులను గుర్తించి, వాటిని మొదట్లోనే నిరోధించేలా టెక్నాలజీ (Crop Disease Detection) గురించి మంత్రికి వివరించారు. అంతేకాకుండా పంట బయటకు కనిపించే వాటినే కాకుండా పంట అంతర్గతంగా ఉన్న తెగుళ్లు, రోగాలను సైతం గుర్తించి దానికి నివారణ చర్యలు కూడా సిఫార్సు చేస్తుందని తెలిపారు. దీని వల్ల వాటికి కావాల్సిన నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించారు.
పొలంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మొక్కకు తెగులు సోకిందో ముందుగానే పసిగట్టి దానికి పిచికారీ చేయాల్సిన మందును సైతం మనకు సూచిస్తుందని చెప్పారు. దీంతో ఆ రైతు తమ పంటకు పిచికారి చేసి పంటలను సరైన సమయానికి సంరక్షించుకోవచ్చన్నారు. అసలు పొలం వద్దకు పోకుండా కూడా ఈ యాప్ సాయంతో పంట స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని మంత్రికి కృషివాస్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. రైతు పంట ఎంత వేశారు, ఎన్ని ఎకరాలలో వేశారు అన్న డేటా కూడా రియల్ టైంలో వ్యవసాయ అధికారులకు లభిస్తుందన్నారు. ఎక్కడైతే తెగుళ్ళు ఏర్పడుతుందో, దానినే ముందుగా గుర్తించి, నివారణ దిశగా చర్యలు తీసుకోవడం వలన రైతులకు మిగతా పొలానికి తెగులు ఏర్పడకుండా నివారించి, తక్కువ కూలీ ఖర్చుతో, అధిక దిగుబడి పొందే అవకాశం కలుగుతుందని అన్నారు.
అంతేకాకుండా ఈ ఏఐ యాప్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ముందస్తు సమాచారం,సమస్యను గుర్తించడం, సమస్య చోటులోనే స్ప్రే చేయడం, వాతావరణ హెచ్చరికలు, నేల మరియు ఆకు తేమ సమాచారం, ఆయిల్ పామ్ (Oil Palm) లో ప్రతి చెట్టు కు రియల్ టైం సమాచారం ఇస్తుందన్నారు.
ఈ యాప్ ద్వారా 60 కు పైగా పంటలను (పత్తి, మొక్క జొన్న, వరి, మిరప, కూరగాయలు, ఆయిల్ పామ్ మరియు ఇంకా ఎన్నో రకమైన పంటలు) పరీక్షించించే విధంగా అవకాశం ఉంది. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు కృషి వికాస్ వెబ్ సైట్లో అందుబాటులో ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..