Home » Ampere Magnus EX.. సింగిల్ చార్జిపై 121కి.మి రేంజ్‌..

Ampere Magnus EX.. సింగిల్ చార్జిపై 121కి.మి రేంజ్‌..

ampere-magnus-ex
Spread the love

రూ.68.999కి Ampere Magnus EX ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

Ampere Magnus ex

Ampere Magnus EX : టూవీల‌ర్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఎగ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ త‌న బ్రాండ్ అయిన ఆంపియర్ ఎలక్ట్రిక్ నుంచి కొత్త మాగ్నస్ EX పేరుతో స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. Ampere Magnus EX లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్. మ‌హారాష్ట్ర పూణేలో మొద‌టిసారి దీనిని ఆవిష్కరించారు. దీని ఎక్స్‌షోరూం ధ‌ర 68,999.
కొన్ని రాష్ట్రాలలో అదనపు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మరింత తగ్గుతూ మరింత ఆకర్షణీయమైన ప్యాకేజీగా మారుతుంది.

Ampere Magnus  ఫీచ‌ర్లు

ఆంపియర్ మాగ్నస్ EX ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ 1200-వాట్స్ మోటార్‌తో వస్తుంది. ఇది ఈ విభాగంలో అత్యధిక మోటార్ సామర్థ్యాలలో ఒకటి అని కంపెనీ పేర్కొంది. ఇది 10 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 50 కిలోమీట‌ర్లు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. అవి సూపర్ సేవర్ ఎకో మోడ్ రెండోది పెపియర్ పవర్ మోడ్లు ఉంటాయి. Ampere Magnus స్కూట‌ర్లో EX 60V, 38.25Ah తేలికైన పోర్టబుల్ అడ్వాన్స్‌డ్ లిథియం బ్యాటరీ ఉంటుది. ఈ బ్యాట‌రీని 5-amp సాకెట్‌తో సులభంగా ఛార్జ్ చేయ‌వ‌చ్చు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

కొత్త ఆంపియర్ మాగ్నస్ EX లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సుమారు 6-7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్ల‌డించింది. మిగ‌తా ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఆల్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, పెద్ద 450 మిమీ లెగ్‌రూమ్, విశాలమైన సీటుతో పాటు పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌తో బూట్ వ‌స్తుంది. ఇందులో కొన్ని అధునాతన ఫీచర్లలో కీలెస్ ఎంట్రీ, వెహికల్ ఫైండర్, యాంటిథెఫ్ట్ అలారం వంటివి ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు ఆకర్షణీయమైన కలర్ .. మెటాలిక్ రెడ్, గ్రాఫైట్ బ్లాక్ మరియు గెలాక్సీ గ్రే వంటి రంగుల్లో అందుబాటులోఉంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఆంపియ‌ర్ కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ పై ఆంపియర్ ఎలక్ట్రిక్ COO రాయ్ కురియన్ వ్యాఖ్యానిస్తూ.. “పెట్రోల్ ధరలు రోజువారీగా పెరుగుతుండ‌డంతో ద్విచ‌క్ర‌వాహ‌న‌దారులు త‌మ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను వెతుకుతున్నార‌ని తెలిపారు. ఆంపియ‌ర్ మాగ్నస్ EX అధిక రేంజ్‌తో వినియోగదారులు సుదూర ప్ర‌యాణాల‌కు అనుకూలంగా ఉంటుంద‌ని తెలిపారు. పెద్ద సౌకర్యవంతమైన స్థలం, విలక్షణమైన రైడ్ సౌకర్యం కారణంగా మాగ్నస్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

బుకింగ్ కోసం కంపెనీ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

  • Range | 100+ Kms –
  • Ease of charging with a detachable battery pack
  • Savings – INR 15p/km* (under IDC Conditions)
  • Access – 350+ Dealerships
  • 10+ Finance Partners Starting at just INR 68,990. (ex showroom)

4 thoughts on “Ampere Magnus EX.. సింగిల్ చార్జిపై 121కి.మి రేంజ్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *