VIJAYAWADA : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి మొక్కలను నాటి సంరక్షిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. వన మహోత్సవాన్ని (Vanamahotsavam-2024) పురస్కరించుకుని మంగళగిరిలోని ఎకో పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటారు. ఏపీకి 50% పచ్చదనం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటాలని, అదే సమయంలో ఉన్న చెట్లను సైతం కాపాడడం మరిచిపోవద్దని ప్రజలకు సూచించారు. హరితాంధ్ర కోసం పాటుపడదాం, మొక్కలు నాటండి అనే నినాదంతో వనమహోత్సవం-2024 కింద రాష్ట్రానికి 50 శాతం పచ్చదనం వచ్చేలా మీరందరూ బాధ్యత వహించాలని అన్నారు.
వనమహోత్సవం (Vanamahotsavam-2024)లో పాల్గొన్న చిన్నారుల నుంచి సీఎం ప్రతిజ్ఞ చేయించారు. ‘‘మా పిల్లల భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వ లక్ష్యం. అందరం హరిత యజ్ఞంలో పాలుపంచుకుందాం.” ప్రతి ఇంటి ఆవరణను, గ్రామాన్ని పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు. ఇక నుంచి ఎక్కువ మొక్కలు నాటిన వారిని గుర్తించి ఆగస్టు 15, జనవరి 26న అవార్డులు అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పర్యావరణంపై మక్కువ ఉందని నాయుడు కొనియాడారు. “అందుకే అతను వ్యక్తిగతంగా చెట్లను నాటారు. పర్యావరణం, అటవీ శాఖలను నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
ప్రతి వ్యక్తి ఏడాదికి రెండు మొక్కలు నాటితే దాదాపు 10 కోట్ల మొక్కలు వస్తాయని సీఎం అన్నారు. ఈ ఏడాది కోటి మొక్కలు నాటడమే లక్ష్యం. కోటి మొక్కలు నాటితే పచ్చదనం 0.33 శాతం పెరుగుతుంది. అమరావతి (Amaravati ) ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అమరావతిని సుందర రాజధానిగా తీర్చిదిద్దుతాం, నీలి ఆకుపచ్చ భావనను ముందుకు తీసుకువెళ్లి, రాజధాని ప్రాంతంలో 51 శాతం చెట్లతో నిండి ఉంటుంది.
26 జిల్లాలలో హరిత ఉద్యమం
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి 50 శాతం పచ్చదనం వచ్చేలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని 26 జిల్లాల్లో ఉద్యమంలా నిర్వహించాలన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో సిటీ అడవులు పెంచనున్నారు. మియావాకీ జపనీస్ టెక్నాలజీ (Miyawaki )ద్వారా, మేము ఒక హెక్టారులో ఒక తోటను పెంచుతాం.. దీనిని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళతాం. “మియావాకీ కోసం MGNREGA నిధులను కలపడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని పవన్ కళ్యాణ్ చేసిన సూచనను నేను అభినందిస్తున్నాను” అని చంద్రబాబు అన్నారు.
AP గతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టిందని, అది ఒక విప్లవమని, ఆ తర్వాత “మేము పెర్కోలేషన్ పిట్‌లను ప్రోత్సహించాము” అని ఆయన గుర్తు చేశారు. మంగళగిరి ఎకో పార్కులో రోజూ ఉదయం 300 మంది వాకింగ్ చేస్తున్నారని, దీన్ని 3 వేలకు పెంచాలని తెలిపారు. మా ఆలోచన హరితాంధ్రప్రదేశ్, మా ఆశయం స్వర్ణాంధ్రప్రదేశ్ అని సీఎం అన్నారు. పిల్లలందరూ మీ తల్లుల పేరిట మొక్కలు నాటాలని, మొక్కలు, చెట్లను సంరక్షించాలని తీర్మానం చేయాలి. అని పిలుపునిచ్చారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..