Aponyx electric scooters | మరో కొత్త ఈవీ కంపెనీ నుంచి త్వరలో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్..

Spread the love

Aponyx electric scooters | దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవం కొనసాగుతోంది. ఫలితంగా  అనేక కొత్త ఆటో OEM లు స్థాపితమవుతున్నాయి.  తాజాగా కొత్త ఈవీ బ్రాండ్ అపోనిక్స్ (Aponyx ) మార్కెట్ లోకి  హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లను విడుదల చేయడానికి సిద్ధమైంది.  కొత్త వినూత్నమైన ఈవీలు దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీని మెరుగుపరచనున్నాయని కంపెనీ చెబుతోంది.

ఈ కంపెనీ గుజరాత్‌లోని సూరత్‌లో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని సిద్ధం చేస్తోంది.  ఇది స్కూటర్ తయారీలో  స్థానికకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తోంది. అంటూ ఈ కంపెనీ వాహనాలన్నీ ఇండియాలోనే పూర్తిగా తయారు కానున్నాయి.   ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పర్యావరణ అనుకూల రవాణాలో భారీ ముందడుగు వేయనున్నాయని అపోనిక్స్ తెలిపింది.

స్థిరమైన, జీరో కార్బన్ రవాణా ను దోహదం చేసే  పర్యావరణ హితమైన భవిష్యత్తును సృష్టించే దృక్పథంతో, అపోనిక్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సెక్టార్‌లోకి ప్రవేశించింది .  ఈ వాహనాలు ప్రయాణ అనుభవాన్నిసమూలంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. చక్కని పనితీరు,  డిజైన్,  పర్యావరణ స్పృహ వంటి లక్షణాల కలయికతో ఈ స్కూటర్లు రానున్నాయి.

త్వరలో విడుదల కానున్న ఈ ఉత్పత్తి కోసం ఎదురుచూస్తున్నట్లు అపోనిక్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యవస్థాపకుడు ,ఛైర్మన్ MS చుగ్ పేర్కొన్నారు.  “అపోనిక్స్‌లో, మెరుగైన భవిష్యత్తును రూపొందించడానికి స్థిరమైన ఆవిష్కరణలను తీసుకొస్తున్నామని తెలిపారు.  త్వరలో ప్రారంభం కానున్న మా హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పర్యావరణ అనుకూల చైతన్య పరిష్కారాలను అందించడంలో   మైలురాయిగా నిలుస్తాయి.

Aponyx electric scooters Features : అపోనిక్స్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనా ల్లో  కొన్ని ప్రామాణికమైన, కీలకమైన ఫీచర్లు దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్, స్మార్ట్ కనెక్టివిటీని కలిగి ఉంటాయి. అదనంగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క సొగసైన  ఆధునిక డిజైన్..  రైడర్ అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా స్టైలిష్ , ఫ్యూచరిస్టిక్ అర్బన్ ల్యాండ్‌స్కేప్‌కు సరిగ్గా సూట్ అవుతుందని తెలిపారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..