దేశ‌వ్యాప్తంగా 10వేల Ather Energy charging stations

Spread the love

Ather Energy charging stations : ఏథర్ ఎనర్జీ భారతదేశంలోని 80 నగరాల్లో 1,000కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేసింది. 2023 చివరి నాటికి 2,500 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ఏథర్ ఎనర్జీ.. దేశ‌వ్యాప్తంగా 80 నగరాల్లో 1,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఏథ‌ర్ కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ వేగవంతంగా ముందుకు సాగుతోంది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు 2023 చివరి నాటికి 2,500 ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌లను ఇన్‌స్టాల్ చేయాలని Ather యోచిస్తోంది.

ఏథర్ ఎనర్జీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు:

Ather Energy ఒక బలమైన ఫాస్ట్-ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. Ather గ్రిడ్ ప్రస్తుతం టైర్-II, టైర్-III నగరాల్లో 60 శాతం పూర్త‌యింది. దీంతో భారతదేశంలో ద్విచక్ర వాహన EVల కోసం అతిపెద్ద ఫాస్ట్-ఛార్జ్ నెట్‌వర్క్‌గా అవ‌త‌రించిన‌ట్లు కంపెనీ పేర్కొంది.

Ather Energy charging stations లలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగ‌దారులు తమ వాహనాలను నిమిషానికి 1.5 కిమీ చొప్పున 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి వీలు కల్పిస్తాయి. ఛార్జింగ్ నెట్‌వర్క్‌కు Ather గ్రిడ్ యాప్ స‌పోర్ట్ ఇస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల యజమానులందరూ రియ‌ల్ టైంలో త‌మ‌కు సమీప ఛార్జింగ్ స్టేషన్‌లను తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా, ఈ సదుపాయం మార్చి 2023 వరకు ఉచితంగా అందించబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..