తొలిసారి ఈ మూడు నగరాల్లోనే..
దేశంలోని అతపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero MotoCorp .. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌లలో పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసే కార్యకలాపాలను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల కోసం ఈ మూడు నగరాల్లోని 50 ప్రదేశాలలో సుమారు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. Hero MotoCorp ఇటవలే Vida బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్‌వాహన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
కస్టమర్ల కోసం కీలకమైన ప్రదేశాలలో ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరించినట్లు కంపెనీ తెలిపింది. Vida ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో వినియోగదారులు వారి ఇ-స్కూటర్ బ్యాటరీని 1.2 kms/min వేగంతో ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఛార్జింగ్ స్టేషన్‌లో DC తోపాటు AC ఛార్జింగ్ సాకెట్లు ఉంటాయి.
Hero MotoCorp vida ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ (EMBU) హెడ్ – డాక్టర్ స్వదేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ “మూడు నగరాల్లో Vida V1 డెలివరీలను ప్రారంభించే ముందు తాము Vida యొక్క ప్రపంచ-స్థాయి EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఇన్‌స్టాల్ చేశామని తెలిపారు. ప్రొడక్ట్, సర్వీస్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాతో Vida వ్యవస్థ తమ కస్టమర్‌లకు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నతంగా ఉంటుందని తెలిపారు.
Vida కస్టమర్‌లు తమ సమీప ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడానికి, తనిఖీ చేసుకోవడానికి, ఛార్జింగ్ స్లాట్‌ను రిజర్వ్ చేయడానికి యాప్ నుండి స్టేషన్‌కి నావిగేట్ చేయడానికి ‘My Vida’ మొబైల్ యాప్‌ని ఉపయోగించవచ్చు. మొత్తం చెల్లింపు ప్రక్రియ కూడా యాప్ ద్వారానే నిర్వహించబడుతుంది.
విడా కంపెనీ బెంగళూరు, జైపూర్‌లలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను, అలాగే ఢిల్లీ-NCRలో పాప్-అప్ స్టోర్‌లను ఏర్పాటు చేసింది. ఇక్కడ వినియోగదారులు Vida V1ని టెస్ట్-రైడ్ చేయవచ్చు. Vida V1ని కొనుగోలు చేయడానికి OEM గ్రీన్ సంస్థ EMI సౌకర్యాన్ని అందిస్తోంది.
Nice